సీఎం జగన్ బస్సుయాత్రతో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ నేతలు

మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తాజాగా తన యాత్రకు బ్రేక్‌ ఇచ్చారు. “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర కు బ్రేక్ ఇచ్చి.. ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ నేతలతో అంతర్గత సమావేశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా 26వ తేదీన వైసీపీ మ్యానిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. త్వరలోనే మేనిఫెస్టోను ప్రవేశ పెట్టి, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియా వింగ్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం అనంతరం బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మంగళవారం నాడు విజయనగరం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్.

సీఎం జగన్ బస్సుయాత్రతో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం యాత్ర సాగిన ప్రాంతాలలో ప్రత్యర్థి పార్టీల నుండి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీల నుండి సీఎం జగన్ సమక్షంలో పలువురు కీలక నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిక. వైసీపీలో చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, ఎంపీపీలు ఉన్నారు. ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతూ ఉండగా.. మరింత మంది పార్టీలో చేరే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Updated On 21 April 2024 11:10 PM GMT
Yagnik

Yagnik

Next Story