ఉగాది సందర్భంగా వేద పండితులు సీఎం దంపతులను ఆశీర్వదించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో

మేమంతా సిద్ధం 12వ రోజున బుధవారం ఏప్రిల్‌ 10న పలు ప్రాంతాల్లో సాగనుంది. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి బస చేసిన గంటావారిపాలెం వద్ద నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభిస్తారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్‌ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్‌ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్‌ బైపాస్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

ఉగాది సందర్భంగా వేద పండితులు సీఎం దంపతులను ఆశీర్వదించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో కార్యక్రమం జరిగింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఉగాది వేడుకలకు హాజరైన సీఎం జగన్, వైఎస్‌ భారతి దంపతులకు శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం ఇచ్చారు.

Updated On 9 April 2024 9:15 PM GMT
Yagnik

Yagnik

Next Story