ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజైన శనివారం(ఏప్రిల్‌ 20) షెడ్యూల్‌ ను వైసీపీ విడుదల చేసింది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన గోడిచర్ల ప్రాంతం నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్య­వరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

సీఎం జగన్ శుక్రవారం నాడు కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్యాకేజి స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంతో చులకన అని... జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఈ ప్యాకేజి స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడయ్యాయి.. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఈ ప్రాంతం మీద ఎలాంటి ప్రేమ ఉండదు, ఈ మ్యారేజి స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయన్నారు. రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే, కులాన్ని హోల్ సేల్ గా బాబుకు అమ్మేయగలనన్న భ్రమతో ప్యాకేజి స్టార్ రాజకీయం చేస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు.

Updated On 19 April 2024 8:46 PM GMT
Yagnik

Yagnik

Next Story