సీఎం జగన్‌ గురువారం సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం నాడు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్‌ గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్‌ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.

సీఎం జగన్‌ గురువారం సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎంకు వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, నందిగం సురేష్, రెడ్డప్ప, అయోథ్య రామిరెడ్డి, వంగా గీత, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్, ఎం.గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు స్వాగతం పలికారు.

Updated On 8 Feb 2024 8:19 PM GMT
Yagnik

Yagnik

Next Story