వైసీపీ(YCP) చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) శుక్రవారం బెంగళూరుకు(Bangalore) బయలుదేరారు

వైసీపీ(YCP) చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) శుక్రవారం బెంగళూరుకు(Bangalore) బయలుదేరారు. దాదాపు నలభై రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకు వెళ్లడం ఇది నాలుగోసారి. వైఎస్ జగన్ గత మంగళవారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు. ఐదు రోజుల వ్యవధిలో తిరిగి వెళ్లారు. ఆగస్టు 5న లేదా 6న ఆయన తాడేపల్లికి తిరిగి రానున్నారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో(General elections) ఓటమి తర్వాత జగన్ బెంగళూరుకు తాడేపల్లికి తిరుగుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నాకు(Delhi Protest) హాజరయ్యారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా ఆయన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. నెలలో రెండు రోజులు తప్పకుండా పులివెందులకు సమయం కేటాయిస్తానని వైఎస్ జగన్ గతంలో చెప్పారు. ఇక వైఎస్ జగన్ అభిమానులను కలవడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. పులివెందులలో అయినా.. తాడేపల్లిలో అయినా కూడా కలవడానికి వచ్చిన అభిమానులను, వైసీపీ కార్యకర్తలను పలకరించి వీలైతే ఫోటోలకు కూడా ఫోజులు ఇస్తూ ఉన్నారు.

Eha Tv

Eha Tv

Next Story