CM Jagan To IPAC office: ఐ-ప్యాక్ ఆఫీసుకు వైఎస్ జగన్
సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడ బెంజి సర్కిల్‌లో
సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడ బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ-ప్యాక్ సంస్థ ఆఫీస్‌ను సందర్శించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధులతో ఆయన చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ కోసం కృషి చేసిన బృందానికి ఆయన కృతజ్ఞతలు చెప్పనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి చేరుకొని దాదాపు 30 నిమిషాలపాటు వారితో జగన్ మాట్లాడనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తొలిసారి సీఎం జగన్ బయటకు రానున్నారు.
ఎన్నికల్లో వైసీపీ కోసం ఐ-ప్యాక్ టీమ్ పని చేస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో తాము గెలవబోతోన్నామని వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజును త్వరలోనే ప్రకటిస్తామని వైసీపీ నేతలు కూడా చెప్పడం విశేషం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందంటూ ఇప్పటికే జగన్ హమీ ఇచ్చారు. మహిళలు, రైతులు, మైనారిటీలు వైసీపీకి ఈ ఎన్నికల్లో భారీ మద్దతు ఇచ్చారని వైసీపీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి.