ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఫలితాలు మాత్రం

ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పోలింగ్‌కు ముందు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని, 17 లక్షల శాంపిల్స్‌ తీసుకున్నామన్నారు. ఎన్నికల్లో పార్టీకి 40 శాతం ఓటింగ్‌ వచ్చిందని, పార్టీ నేతలంతా ప్రజల మధ్యనే ఉండాలని జగన్ సూచించారు. వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని.. మరింత ఇబ్బంది పెడతారని, నష్టపోయిన కార్యకర్తలను తను పరామర్శిస్తామని, భరోసా ఇస్తానని జగన్ అన్నారు. కార్యకర్తలపై దాడులను అంతా కలిసి ఎదుర్కోవాలని, జిల్లా స్థాయిలో టీమ్‌గా నిలవాలని, కార్యకర్తలకు అండగా ఉండి ఆదుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులను మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జగన్ కలిశారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, ఇంతియాజ్, బిజేంద్రారెడ్డి, జక్కంపూడి రాజా తదితరులు సీఎం జగన్ ను కలిశారు.

Updated On 11 Jun 2024 9:04 PM GMT
Yagnik

Yagnik

Next Story