బడ్జెట్ సమావేశాలు కావటంతో హాజరు అవ్వాల్సిన అంశం పైన నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

బడ్జెట్ సమావేశాలు కావటంతో హాజరు అవ్వాల్సిన అంశం పైన నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఇక, జగన్ ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాలను పూర్తి చేసిన తరువాత జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తానని నేతలకు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఏడు జిల్లాల నేతలతో సమావేశాలు పూర్తయ్యాయని.. మిగిలినవి పూర్తి చేయాల్సి ఉందని నేతలకు వివరించారు. వీటిని పూర్తి చేసి ఉగాది నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేసారు. తొలుత సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తానని జగన్ చెప్పినా.. లండన్ పర్యటన తో వాయిదా పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తో ఇక, ఉగాది నుంచి తన పర్యటన లు ఉంటాయని జగన్ వెల్లడించారు.

ehatv

ehatv

Next Story