చంద్రబాబు నాయుడు.. ఈ ఎల్లో మీడియా కలిసి ఒక నిర్ణయానికి వస్తారు.. వీరంతా కలిసి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇస్తున్నది బోగస్‌ రిపోర్టు మాత్రమేనని.. వైఎస్‌ జగన్‌ ఇస్తున్నది కళ్లెదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్‌ రిపోర్టు అని సీఎం జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహించామని అన్నారు. వాహన మిత్ర, నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. ఇలా అన్ని విధాలా ప్రోత్సహించాము కాబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతోందన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల తమ ప్రభుత్వంలో ఇంటింటికీ అభివృద్ధి వచ్చి చేరిందని.. సంక్షేమాన్ని, లంచాలు, వివక్ష లేని పాలనను అందించామని అన్నారు.

చంద్రబాబు నాయుడు.. ఈ ఎల్లో మీడియా కలిసి ఒక నిర్ణయానికి వస్తారు.. వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొచ్చి దాన్ని గుర్రం, గుర్రం అంటూ పదే పదే ఊదరగొడతారు. ఇలా 30 ఏళ్లుగా చేస్తూ వస్తున్నారని సీఎం జగన్ అన్నారు. 2014లో జాబు రావాలి అంటే బాబు రావాలి అని సభల్లో, టీవీ చానళ్లలో ఊదరగొట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే ఈ 58 నెలల కాలంలో 54 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు సీఎం జగన్. 58 నెలల్లో మొత్తం 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మీ బిడ్డ పాలన రాక ముందు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే, ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ మరో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడని అన్నారు సీఎం జగన్.

Updated On 10 April 2024 8:58 PM GMT
Yagnik

Yagnik

Next Story