తోడబుట్టిన అన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో వై.ఎస్‌.షర్మిల ఆస్తుల తగవు పెట్టుకున్నారు.

తోడబుట్టిన అన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో వై.ఎస్‌.షర్మిల ఆస్తుల తగవు పెట్టుకున్నారు. తన అన్న ఆస్తులు పంచకుండా అన్యాయం చేశారంటూ మీడియాకెక్కారు. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు. తనకు న్యాయంగా దక్కాల్సిన ఆస్తులను జగన్ ఇవ్వడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇవన్నీ చూసి నిజమేకాబోలనుకున్నారు కొందరు. ఈ కొందరిలో వైసీపీ(YCP) నాయకులు కూడా ఉన్నారు. అయితే షర్మిల చెబుతున్నదంతా పచ్చి అబద్ధాలని జగన్‌ కౌంటర్‌ ఇచ్చారు. షర్మిలకు ఇచ్చిన ఆస్తుల వివరాలను, నగదు రూపంగా ఇచ్చిన సొమ్మను సాక్షిలో ప్రచురించారు. దాంతో అందరికీ నిజమేమిటో తెలిసింది. హ‌క్కుగా రావాల్సిన వాటాతో పాటు భారీ మొత్తంలో డ‌బ్బు, ఆస్తుల్ని ఇచ్చినా, ఇంకా ఇవాలని అనుకుంటున్నా షర్మిల (YS Sharmila)ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదని అంటున్నారు. దీని వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలిసింది. వారం రోజులుగా ఇదే అంశంపై రెండు వర్గాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయలేకపోతున్నామని జగన్మోహన్‌రెడ్డి(Ys Jagan Mohan Reddy) గ్రహించారు. అందుకే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

'వైఎస్‌ఆర్‌ కుటుంబంలో వ్య‌క్తిగ‌త అంశాల్ని సైతం ర‌చ్చ‌కీడ్చి, వాటిని వ‌క్రీక‌రించి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయాల‌నే చంద్ర‌బాబు(CM Chandrababu), ఎల్లో మీడియా దుర్బుద్ధిని ఎండ‌గ‌ట్టాల‌ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది. ఈ అంశంపై ఇప్ప‌టికే అన్ని వివ‌రాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచాం. ఇప్పుడు మంచి, చెడుల‌ను ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకుంటారు. ఈ వ్య‌వ‌హారం న్యాయ‌స్థానాల్లో ఉన్నందున, ఇక వాద‌న‌లు ఏవైనా కోర్టుల్లోనే చేసుకునే వెసులుబాటు ఎవ‌రికైనా ఉన్నందున‌, దీనికి ఇక్క‌డితో ముగింపు ప‌ల‌కాల‌ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) భావిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వ న‌య వంచ‌న‌ల‌ను నిల‌దీయ‌డంపై దృష్టి పెట్టాలి' అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది పార్టీ. అంటే షర్మిల ట్రాప్‌లో పడకూడదనే నిర్ణయానికి వచ్చిందన్నమాట! షర్మిల వ్యాఖ్యలను లైట్‌ తీసుకోవాల్సిందిగా క్యాడర్‌కు జగన్‌ సూచించారన్నమాట! షర్మిలకు వత్తాసు పలుకుతూ తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా కథనాలు వండివార్చడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉంది. షర్మిల తీరును ఇప్పటికే ఎండగట్టాల్సిందంతా ఎండగట్టారు. ఇంతకుమించి ఆమెకు ప్రాధాన్యం ఇవ్వకూడదని జగన్‌ నిర్ణయించుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా షర్మిలకు బాధించే ఉంటుంది. ఎందుకంటే తను లైమ్‌లైట్‌లో ఉండాలంటే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూ ఉండాలని ఆమెఅనుకుంటున్నారు. ఇక నుంచి వారు పైలెంట్‌గా ఉంటే షర్మిల ఏం చేస్తారో చూడాలి. ఆమెను నడిపిస్తున్నవారు ఇప్పుడేం పన్నాగం పన్నుతారో చూడాలి.

ehatv

ehatv

Next Story