ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan) విపరీతమైన క్రేజ్‌ ఉంది. ప్రజాదరణ కూడా బ్రహ్మండం.. ఈ విషయం ఎవరో చెప్పాల్సిన పని లేదు. బుధవారం రాత్రి ఒకే సమయంలో వేరువేరు ఛానెళ్లలో ప్రసారమైన రెండు ఇంటర్వ్యూలే(Interveiws) ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9(TV9) కోసం సీఎం జగన్మోహన్‌రెడ్డితో రజనీకాంత్‌(Rajinikanth) ఇంటర్వ్యూ చేశారు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా అయిన ఏబీఎన్‌లో(ABN) ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ(Radha krishna) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును(Chandrababu) ఇంటర్వ్యూ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan) విపరీతమైన క్రేజ్‌ ఉంది. ప్రజాదరణ కూడా బ్రహ్మండం.. ఈ విషయం ఎవరో చెప్పాల్సిన పని లేదు. బుధవారం రాత్రి ఒకే సమయంలో వేరువేరు ఛానెళ్లలో ప్రసారమైన రెండు ఇంటర్వ్యూలే(Interveiws) ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9(TV9) కోసం సీఎం జగన్మోహన్‌రెడ్డితో రజనీకాంత్‌(Rajinikanth) ఇంటర్వ్యూ చేశారు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా అయిన ఏబీఎన్‌లో(ABN) ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ(Radha krishna) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును(Chandrababu) ఇంటర్వ్యూ చేశారు. ఈ రెండు ఇంటర్వ్యూలు రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారమయ్యాయి. టీవీ9లో జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూను లైవ్‌లో అత్య‌ధికంగా 72 వేల మంది చూశారు. ఇదే చంద్ర‌బాబునాయుడి ఇంట‌ర్వ్యూను అత్య‌ధికంగా 20 వేల మంది చూశారు. అర్థమయ్యింది కదా! జగన్‌ మానియా ఎలాంటిదో! జ‌గ‌న్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో బుధవారం రాత్రి ఇంట‌ర్వ్యూను లైవ్‌లో చూసిన వీక్షకుల సంఖ్యే చెబుతున్న‌ది. టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబును జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తున్నా అది సాధ్యం కావడం లేదు. చంద్రబాబు ప్రసంగాలు ఎంత బోర్‌ కొట్టిస్తాయో, ఆయన ఇంటర్వ్యూ కూడా అట్లాగే విసుగు పుట్టిస్తుంటుంది. అందుకే చంద్రబాబు మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు. అదే సమయంలో జగన్ ఏం చెబుతారో వినాలనే క్యూరియాసిటీ జనాల్లో ఉండింది. అవకాశవాదంతో చంద్రబాబు తీసుకున్న యూటర్న్‌లు, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జనాలకు తెలియంది కావు. అందుకే ఆయ‌న చెప్పింది విన‌డానికి జ‌నం ఆస‌క్తి చూప‌లేద‌ని విశ్లేషకులు అంటున్నారు. పైగా చంద్రబాబు భజన చేసే రాధాకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అందరికీ తెలుసు. అందుకే ఆ వైపు ఎవరూ వెళ్లలేదు. వెళ్లినవారు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు!

Updated On 9 May 2024 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story