ఏపీ అసెంబ్లీలో (Ap Assembly) ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవంపై మాజీ సీఎం, వైసీపీ (Ycp)అధినేత జగన్‌ (Ys Jagan)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ys Jagan Mohan Reddy: ప్రతిపక్ష నేత హోదాపై జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీలో (Ap Assembly) ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవంపై మాజీ సీఎం, వైసీపీ (Ycp)అధినేత జగన్‌ (Ys Jagan)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు తనను కొలంబియా(Colombia) డ్రగ్‌ సప్లయిర్‌ ఎస్కోబార్‌తో (Escobar)పోల్చడంపై జగన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్షంగా గుర్తించరట. అందుకే ప్రెస్‌మీట్‌ ఈ విషయాలన్నీ చెప్తున్నానని జగన్‌ అన్నారు.

ప్రతి పక్ష నేతగా గుర్తిస్తే తప్పనిసరిగా మైక్‌ ఇవ్వాల్సి వస్తుందని, సభనాయకుడితో పాటుగా ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం మైక్‌ ఇవ్వాల్సి ఉంటుందని అందుకే సభలో తన గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ప్రతిపక్ష నేతగా గుర్తించలేదంటున్నారు. సభలో ఒకటే పక్షం ఉండాలని చంద్రబాబు(chandrababu) అనుకుంటున్నారని, విపక్షం లేకుండా చూసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. చంద్రబాబు వైఫల్యాలను సభలో ఎత్తి చూపుతామన్న దుగ్ధతోనే ప్రభుత్వం ఈ పనిచేస్తోందని విమర్శించారు. బయట ఎవరూ ప్రశ్నించకూడదు, లోపల ఎవరూ మాట్లాడకూడదన్న వ్యవహారశైలి ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు ఏం చేసినా జగన్‌ మాట్లాడకూడదన్న దుర్మార్గ ఆలోచనతో చంద్రబాబు ఉన్నాడని విమర్శించారు.

కొలంబియా డ్రగ్‌ సప్లయిర్‌ ఎస్కోబార్‌తో పోల్చడంపై ఘాటుగా స్పందించారు. ఆయన చంద్రబాబు స్నేహితుడేనా అని మీడియాను ప్రశ్నించారు. అతనెవరో చంద్రబాబుకు బాగా తెలిసినట్లుందని చమత్కరించారు. అంతేకాకుండా తన ఢిల్లీ (Delhi)ధర్నాకు కాంగ్రెస్‌ (Congress Party)ఎందుకు మద్దతియ్యలేదో ఆ పార్టీనే అడగాలన్నారు.

Updated On 26 July 2024 2:00 PM GMT
Eha Tv

Eha Tv

Next Story