Anchor Shyamala : యాంకర్ శ్యామలకు కీలక పదవి ఇచ్చిన వైసీపీ అధిష్టానం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదని ఇటీవల జగన్(YS Jagan) పర్యటనలకు వస్తున్న ప్రజలను చూస్తే అర్థమవుతోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదని ఇటీవల జగన్(YS Jagan) పర్యటనలకు వస్తున్న ప్రజలను చూస్తే అర్థమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత కొంతమంది కీలక నేతలు పార్టీని వదిలిపెట్టి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అధినేత జగన్ తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకూ స్థానచలనం కల్పించారు. తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించారు. మాజీ మంత్రి ఆర్.కె.రోజా(RK roja), మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి(Bhuvana karunakar reddy), జూపూడి ప్రభాకర్‌రావులను(Jupudi prabhakar) అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈ జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామల(shyamala) కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్నటి ఎన్నికల్లో శ్యామల పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. తనమీద టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎంతగా దుష్ర్పచారం చేసినా, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడినా శ్యామల మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పిఠాపురానికి వెళ్లి పవన్ కల్యాణ్‌ను(Pawan Kalyan) విమర్శించారు కూడా! వైసీపీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన జగన్ ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేశారు.