ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. పోలీసులు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుకు "వాచ్‌మెన్‌ల"లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలు తీసేసి, బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. ప్రజలు, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ ఆయన అన్నారు. పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు.

కొందరు పోలీసులు తమ టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్‌ చేయకుండా చంద్రబాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్నారని.. వారికి చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. చంద్రబాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్‌ జగన్‌ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

ehatv

ehatv

Next Story