YS Jagan Vs Sharmila: జగన్-షర్మిల మధ్య ఆస్తుల పంచాయితీ... ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసిన జగన్!
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, వై.ఎస్.షర్మిల మధ్య ఆస్తి తగాదాలు నిజమేనని తెలుస్తోంది.
వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, వై.ఎస్.షర్మిల మధ్య ఆస్తి తగాదాలు నిజమేనని తెలుస్తోంది. తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలపై జనగ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడమే ఇందుకు నిదర్శనం. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్(Saraswati Power and Industries Private Limited)లో వాటాల కేటాయింపుపై వచ్చిన వివాదం నేపథ్యంలో జగన్(Ys Jagan), ఆయన భార్య భారతిలు ఎన్‌సీఎల్‌టీ(NCLT)లో పిటిషన్ వేశారు. ఇందులో ప్రతివాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, షర్మిల(Ys Sharmila), విజయలక్ష్మి(Vijayalaxmi), చాగరి జనార్దన్ రెడ్డి(Chagari Janardhan Reddy), కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి(Kethireddy Yaswanth Reddy), రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రరర్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలను చేర్చారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ ఎదుగుదలలో తాము కీలక పాత్ర పోషించామని పిటిషన్‌లో జగన్, భారతి పేర్కొన్నారు. షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21వ తేదీన ఎంఓయుపై సంతకం చేశామని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ కేటాయింపు ఖరారు కాలేదని పిటిషన్‌లో తెలిపారు. ఇప్పుడు వివాదానికి ఇదే కారణం. చెల్లెలు షర్మిలపై అనురాగంతో వాటాలు కేటాయించాలని అనుకున్నామని, అయితే ఈ మధ్యకాలంలో ఆమె తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి అనేక కుట్రలు పన్నిందని, అందుకే ఆ వాటాల కేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని ప్రకటించాలని, తన తల్లి, చెల్లి కోసం ఉద్దేశించిన షేర్ల బదిలీని రద్దు చేయాలని ఎన్‌సీఎల్‌టీని జగన్ కోరారు. గతంలో వాటాలు ఇద్దామనే అనుకున్నామని, ఇప్పుడు విజయలక్ష్మికి కానీ, షర్మిలకు కానీ వాటాలు ఇవ్వదల్చుకోలేదని జగన్ తెలిపారు. ఈ కేసుపై జగన్ నాలుగు మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించి ఎన్‌సీఎల్‌టీ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.