షర్మిలకు జగన్ లేఖ

వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS sharmila) కుటుంబంలో ఆస్తుల(Property) పంచాయితీ పది మందికి తెలిసిపోయింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)- ఆయన చెల్లెలు వై.ఎస్‌.షర్మిల(YS sharmila) మధ్య ఆస్తుల గొడవ కోర్టులకు(Court) చేరింది. ప్రస్తుతం ఇద్దరూ ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు విసురుకుంటున్నారు. సరస్వతి పవర్‌ ప్లాంట్‌(Saraswati power plant) షేర్ల విషయంలో అన్నాచెల్లెల మధ్య తగవు వచ్చింది. ఈ వివాదంపై జగన్‌కు షర్మిల రాసిన లేఖను తెలుగుదేశంపార్టీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జగన్ కూడా షర్మిలకు భావోద్వేగాలతో కూడిన ఓ లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాజకీయంగా తనను విభేదించిన విషయాన్ని, వ్యక్తిగత దూషణలకు దిగిన అంశాన్ని లేఖలో జగన్ ప్రస్తావించారు. ఆర్ధికంగా చేసిన లావా దేవీల గురించి కూడా జగన్ వివరించారు. తనను రాజకీయంగా వ్యతిరేకించటం తో పాటుగా వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బ తీసేలా వ్యవహరించావని లేఖలో పేర్కొన్నారు. బహిరంగంగా తనపై తప్పుడు ప్రకటనలు చేశావని, అబద్ధాలు చెప్పావని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నువ్వు (అంటే షర్మిల) చేసిన చర్యలు నన్ను అమితంగా బాధించాయి. ఈ కారణంగానే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కు తీసుకుంటున్నాను' అని లేఖలో జగన్‌ తెలిపారు. నాన్న రాజశేఖర్‌రెడ్డి సంపాదించిన, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని ఆయన బతికి ఉన్నప్పుడే ఇద్దరికీ సమానంగా పంచిన విషయాన్ని జగన్ తన లేఖలో తెలిపారు. అనంతరం తాను స్వశక్తితో వ్యాపారాలు ప్రారంభించానన్నాను. అలాంటి ఆస్తులకు వారసత్వంతో సంబంధం లేదన్నారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతతో కొన్ని ఆస్తులను నీ ( షర్మిల) పేరిట బదిలీ చేసానని జగన్ వివరించారు. అమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చానన్నారు. న్యాయ పరమైన చిక్కులు తొలిగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలకు చెందేలా ఒప్పందం చేసినట్లు గుర్తు చేసారు. అవి కాకుండా తన చెల్లికి నేరుగా, అమ్మ ద్వారా గత దశాబ్ద కాలంగా 200 కోట్ల రూపాయలు ఇచ్చానని షర్మిలకు రాసిన లేఖలో జగన్ తెలుపుతూ ఇదంతా ప్రేమతోనే చేసానని అన్నారు. ఇంత ప్రేమ ఆప్యాయతలు కురిపించినా షర్మిల కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా తనతో వ్యవహరించిన తీరు తనను అమితంగా బాధించిందని జగన్ లేఖలో వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డ షర్మిలపై ఇక నుంచి ప్రేమ, ఆప్యాయత చూపాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. షర్మిల ఆలోచనలో, ప్రవర్తనలో ఏమైనా సానుకూల మార్పు వస్తే కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎంత చేయాలి? అనే అంశాలను తిరిగి పరిశీలిస్తానని జగన్ లేఖలో స్పష్టంగా చెప్పారు జగన్‌. అవినాశ్, భారతికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. మొత్తంమీద చెల్లెలు షర్మిలకు అన్న జగన్ లేఖ ద్వారా గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story