2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు గెలిచి ఘోర ఓటమిని చవిచూసింది వైసీపీ.

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగుపెడతా..! ఇదీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ డిమాండ్.2024లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష ఇవ్వడం కుదరదంటూ ఖరాఖండీగా చెబుతున్న అధికార పార్టీ.ప్రతిపక్ష హోదా అంశంపై రాజ్యాంగం ఏం చెబుతోంది..?జగన్ డిమాండ్ ఎంతవరకూ కరెక్ట్..?గతంలో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా..?

ఇప్పుడు చూద్దాం..

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు గెలిచి ఘోర ఓటమిని చవిచూసింది వైసీపీ. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి అసెంబ్లీ సెషన్ కు హాజరైన వైఎస్ జగన్.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టారు లేకపోతే అసెంబ్లీలోకి అడుగుపెట్టనని భీష్మించారు.

అనూహ్యంగా అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు వచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి సమావేశాలను బాయ్ కాట్ చేశారు.

అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేసిన తర్వాత ప్రతిపక్ష హోదాపై మాట్లాడారు బొత్స సత్యనారాయణ. సభలో ఉండేవి రెండే పక్షాలని.. అవి అధికార, ప్రతిపక్షమని అన్నారు. ఏ విధంగా చూసుకున్నా తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

మరోవైపు.. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ తాము కాదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతిపక్ష హోదా ఎలా పడితే అలా ఇస్తే ప్రజాస్వామ్యం ఎలా ఒప్పుకుంటుందని అన్నారు.

ఇక కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన సైతం.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

అసెంబ్లీ రూల్స్ ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కూడా స్పష్టం చేశారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని అన్నీ తెలిసిన జగన్ ఎలా ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్.. ప్రతిపక్ష హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేను డోర్ తెరిస్తే ఉన్న 23 టీడీపీ ఎమ్మెల్యేలలో ఎంతమంది వస్తారో తెలియదని, అప్పుడు టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అన్నారు.

కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య ప్రతిపక్ష హోదా వార్ జరుగుతున్న నేపథ్యంలో అసలు రాజ్యాంగం ఏం చెబుతోంది..? గతంలో ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా..? అనే చర్చ జరుగుతోంది.

సాధారణంగా చట్టసభల్లో అధికార, ప్రతిపక్షాలు ఉంటాయి. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ లేదా కూటమిది అధికార పక్షమైతే.. రెండవ అత్యధిక స్థానాలు పొందిన పార్టీది ప్రతిపక్షం. అయితే.. ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లు కలిగి ఉండాలి. పొత్తు పరిగణనలోకి రాదు.

1972 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 287 స్థానాలకు గాను 219 సీట్లను కైవసం చేసుకుంది. సీపీఐ 7 స్థానాలకు పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థులు 57 స్థానాల్లో గెలుపొందారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 21 మంది శాసనసభ్యులు ఉండాలి. కానీ సీపీఐకి వచ్చింది మాత్రం కేవలం 7 సీట్లే. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఖాళీగా ఉంది.

ehatv

ehatv

Next Story