YS Jagan : రాష్ట్రానికి 'చంద్ర'గ్రహణం పట్టింది
గత వైసీపీ ప్రభుత్వంపై నిందలు మోపేందుకు కుట్రలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan) ఆరోపించారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై(Power Purchase agreement) గత వైసీపీ ప్రభుత్వంపై నిందలు మోపేందుకు కుట్రలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం(SECI), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని.. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతున్నారని జగన్ అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ వల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. చంద్రబాబు(Chandrababu) హయాంలో డిస్కంల(Discom) పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్ పవర్ ఒప్పందాలు(Solar power Agreements) రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చామని.. ఉచిత కరెంట్ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ టైంలో యూనిట్‌ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సరఫరా సేందుకు 24 బిడ్లు వచ్చాయి. చంద్రగ్రహణం కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం మేం వివిధ కోర్టుల్లో పోరాడాల్సి వచ్చింది. అలాంటి టైంలో ఈ ఒప్పందం జరిగిందన్ననారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పొగుడుతూ.. రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకీ అభినందించింది. యూనిట్‌కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్‌ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇందులో 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించిన పవర్ ఆఫర్ ఇదని జగన్ అన్నారు.