ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్టు ప్రకటించారు.

కేంద్రప్రభుత్వ సంస్థ సెకీతో(SECI) తమ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం(Elecricity agreement) చేసుకోవడంపై ఈనాడు(Enadu), ఆంధ్రజ్యోతి(andhrajyoti) తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) మండిపడ్డారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్టు ప్రకటించారు. అదానీ(Adani) త‌న‌కు భారీ మొత్తంలో లంచం(Bribe) ఇచ్చిన‌ట్టు ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్నాయని ఈ రెండు పత్రికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే అత్యంత తక్కువ ధరకు విద్యుత్ ఒప్పందం చేసుకుంటే, దానిపై కూడా బుర‌ద చ‌ల్లుతూ రాత‌లు రాయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని జగన్మోహన్‌రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు(Chandrababu) హ‌యాంలో చేసుకున్న విండ్‌, సోలార్ ప‌వ‌ర్ ఒప్పందాల‌తో ఏపీకి అద‌న‌పు భారం ప‌డింద‌ని జగన్‌ గుర్తు చేశారు. చంద్ర‌బాబు పీపీఏల వ‌ల్ల రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల భారం ప‌డింద‌ని, అద‌నంగా 3.41 రూపాయలు క‌ట్టాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. 2021 సెప్టెంబ‌ర్ 15న సెకీ నుంచి తియ్య‌టి క‌బురుతో కూడిన లేఖ వ‌చ్చింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల్ని ప్ర‌శంసిస్తూ, రైతుల విష‌యంలో ప్ర‌ద‌ర్శిస్తున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను సెకీ అభినందించింద‌ని జగన్మోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story