Gudivada Amarnath : మాజీ మంత్రులకు జగన్ కీలక బాధ్యతలు
వైసీపీ(YCP) ఓటమి తర్వాత దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు ఆ పార్టీ అధినేత జగన్(YS Jagan).
వైసీపీ(YCP) ఓటమి తర్వాత దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు ఆ పార్టీ అధినేత జగన్(YS Jagan). పలు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటిస్తూ వచ్చిన జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న మూడు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు(Gudivada amarnath) బాధ్యతలు అప్పగించారు. గతంలో కూడా వైసీపీ అధ్యక్షునిగా గుడివాడ అమర్నాత్ ఉన్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా, చంద్రబాబుపై(Chandrababu) ఒంటికాలితో లేచే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. మరో జిల్లా అనకాపల్లికి అధ్యక్షుడిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడుకు(muthyala naidu) బాధ్యతలు అప్పగించారు. విశాఖ జిల్లాలో ప్రధాన సామాజికవర్గానికి చెందిన వెలమకు జగన్ ఈ బాధ్యతలు అప్పగించారు. మరో జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు(Vishweswa raju) బాధ్యతలు అంటగట్టారు. ఎమ్మెల్యేగా ఉంటూ జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు జగన్‌కు వీరవిధేయులుగా ఉంటారన్న పేరు ఉంది. జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారన్న నమ్మకం ఉంది. దీంతో ఈ నేతలకు కీలక బాధ్యతలను జగన్ అప్పగించారని తెలుస్తోంది.