కడప(Kadapa) లోక్‌సభ స్థానం ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YCP) తరఫున వై.ఎస్.అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy) పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వై.ఎస్. షర్మిల బరిలో దిగారు. ఈ ఇద్దరు వరుసకు అన్నాచెల్లెళ్లు. తెలుగుదేశంపార్టీ(TDP) నుంచి భూపేశ్ రెడ్డి(Bhupesh Reddy) పోటీ చేస్తున్నారు. అవినాశ్, షర్మిల(YS Sharmila) మధ్య జరుగుతున్న ఫైట్ అమితాసక్తిని కలిగిస్తోంది.
కడప(Kadapa) లోక్‌సభ స్థానం ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YCP) తరఫున వై.ఎస్.అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy) పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వై.ఎస్. షర్మిల బరిలో దిగారు. ఈ ఇద్దరు వరుసకు అన్నాచెల్లెళ్లు. తెలుగుదేశంపార్టీ(TDP) నుంచి భూపేశ్ రెడ్డి(Bhupesh Reddy) పోటీ చేస్తున్నారు. అవినాశ్, షర్మిల(YS Sharmila) మధ్య జరుగుతున్న ఫైట్ అమితాసక్తిని కలిగిస్తోంది. షర్మిల నేరుగా అవినాశ్‌ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డిని పక్కన పెట్టుకుని ఊరూరు తిరుగుతున్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసిందే అవినాశ్‌రెడ్డి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వివేకా మృతికి కారకుడైన వ్యక్తిని ఓడించాలని ప్రజలకు విన్నవించుకుంటున్నారు. తన బాబాయ్ వివేకాను అవినాశ్ హత్య చేయించాడు కాబట్టి అతడిని ఓడించాలని కోరుతున్నారు షర్మిల. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఘటనపై జగన్మోహన్‌రెడ్డి రీసెంట్‌గా రియాక్టయ్యారు. తన బాబాయ్‌ను ఎవరు హత్య చేశారో పైన ఉన్న భగవంతుడికి తెలుసు, కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థలకు తెలుసని జగన్ అన్నారు. అంతకు మించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఇక అవినాశ్ కూడా తనపై వస్తున్న ఆరోపణలకు జవాబిచ్చారు. వివేకా హత్యను తాను చేయించినట్టు కొందరు మాట్లాడుతున్నారని, అలాంటి విమర్శలు చేస్తున్నవారిని వదిలేయండి, మనిషి పుట్టుక పుట్టి ఉంటే ఇలా ఎవరూ చేయరు అని అవినాశ్ చెప్పుకొచ్చారు. ఈ మాటను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇది చాలా పెద్ద మాట. తన ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు అవినాశ్‌ను ఏ స్థాయిలో ఆవేదనకు గురి చేశాయో అర్థమవుతోంది.