Y.S Lakshmi : సౌభాగ్యమ్మకు నివాష్రెడ్డి తల్లి ఘాటైన సమాధానం
మాజీ మంత్రి దివంగత వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ(Y.S. Sowbhagya) ముఖ్యమంత్రి జగన్‌కు(CM Jagan) నిన్న ఒక లేఖ రాశారు. ఆ లేఖలో జగన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. మీ చిన్నాన్నను దారుణంగా హత్య చేస్తే దానిని అంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావంటూ నిలదీశారు. ఇవాళ సౌభాగ్యమ్మ లేఖకు అనివాష్‌రెడ్డి(Avinash Reddy) తల్లి లక్ష్మీ(Lakshmi) ఘాటైన సమాధానం ఇచ్చారు. మీ వ్యవహారం దొంగే దొంగను పట్టుకోమన్నట్టుగా ఉందని లేఖలో రాశారు. జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకు వచ్చేయమని సలహా ఇచ్చారు. ఇదీ సౌభాగ్యమ్మకు లక్ష్మి ఇచ్చిన ప్రత్యుత్తరం...

అమ్మా సౌభాగ్యమ్మ..
2009లో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తుకు వస్తున్నదా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ను చిన్నచూపు చూసినప్పుడు జగన్‌కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరు అందరూ కలిసి ఒంటరివానిగా చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా? 2011లో నీ భర్తను నీవు, నీ కుమార్తె, అల్లుడు కలిసి విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉండినదో మీకు తెలియదా? నీ కుమార్తె, అల్లుడు పూల అంగళ్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంతో మనోవేదన అనుభవించారో మీకు తెలియదా? వివేకానందరెడ్డిగారు(Vivekananda Reddy) జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవం. అలాగే 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్‌ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతనే(YS Sunitha) మీడియాకు వెల్లడించింది. ఇవాళ మళ్లీ మీరు అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా? ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారు? మీ కుమార్తె నిజమైన న్యాయం కోస పోరాటం చేస్తా ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలా కాకుండా మీ కుమార్తె వైఎస్‌ఆర్ గారు, జగన్ శత్రువులతో చేతులు కలిపి, వారి చేతలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు?
హత్యకు కారణకులైన వారు మీతోనే ఉన్నారు. మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ?
మాటిమాటికి హంతకులని మీరు మాట్లాడుచున్నారు. చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్‌ను తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడు అని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడటం తప్పు అనిపించడం లేదా మీకు? నీ కుమార్తెను, షర్మిలమ్మను(YS Sharmila) ఎవరు టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం.
ఇప్పటికైనా వైఎస్‌ఆర్‌గారు, జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయపోరాటం చేయండి. అన్యాయంగా మీ వల్ల బాధింపబడినవారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంతో లోతులో దాచినా దాగడు. తప్పకుడా బయటపడుతుంది.
ఇట్లు
వై.ఎస్.లక్ష్మీ
W/O వై.ఎస్.భాస్కర్‌రెడ్డి
పులివెందుల