YS Avinash Reddy : చంద్రబాబుకు వైఎస్ ఆవినాష్ రెడ్డి కౌంటర్
కడప జిల్లా పులివెందులలో చంద్రబాబు నాయుడు(Chandra babu) స్పీచ్ కు ఎంపీ వైఎస్ ఆవినాష్ రెడ్డి(YS Avinash Reddy) కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులకు(Pullivendhula) వచ్చి జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు.. బాబు నోటి నుండి వచ్చేవన్నీ అబద్ధాలేనని అన్నారు.

YS Avinash Redd
కడప జిల్లా పులివెందులలో చంద్రబాబు నాయుడు(Chandra babu) స్పీచ్ కు ఎంపీ వైఎస్ ఆవినాష్ రెడ్డి(YS Avinash Reddy) కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులకు(Pullivendhula) వచ్చి జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు.. బాబు నోటి నుండి వచ్చేవన్నీ అబద్ధాలేనని అన్నారు. సీఎం జగన్(CM Jagan) చిత్తశుద్ధి గల నాయకుడని అన్నారు. చంద్రబాబు లాగే సీఎం జగన్ ఆలోచించి ఉంటే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసేవారా అని ప్రశ్నించారు. నీ సొంత నియోజకవర్గంను కూడా సీఎం జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని పేర్కొన్నారు.
అబద్ధాలు మానేసి.. ప్రజలకు క్షమాపణలు చెప్పి.. నీ ప్రాంతానికి నువ్వు ఏం చేశావో చెప్తే ప్రజలు ఎంతో కొంత విశ్వసిస్తారని అన్నారు. నేను సింహాన్నీ, కొదమసింహాన్ని అని బాబు చెప్పుకుంటే సరిపోదు ప్రజలు అనాలని అన్నారు. పక్క జిల్లాల్లోకి పోయి పులివెందుల రౌడీ లు, కడప గుండాలు అని ఉచ్చరించే చంద్రబాబుకు ఎందుకు మా ప్రాంతంపై అంత ద్వేషం అని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్ల ట్రాక్ రికార్డ్‌లో అన్ని నాశనం చేశాడని మండిపడ్డారు.
