వివేకా హత్య కేసులో(Vivek Murder Case) వైఎస్ అవినాష్ రెడ్డి(YS avinash Reddy) నేడు సీబీఐ కోర్టుకు(CBI Court) హాజరయ్యారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసింది.

వివేకా హత్య కేసులో(Vivek Murder Case) వైఎస్ అవినాష్ రెడ్డి(YS avinash Reddy) నేడు సీబీఐ కోర్టుకు(CBI Court) హాజరయ్యారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కోర్టుకు హాజ‌ర‌య్యారు. వివేకా హత్య కేసులో సీబీఐ(CBI).. అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. కేసులో సీబీఐ మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేప‌థ్యంలో.. అవినాష్ రెడ్డి జూన్ 19న సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాశారు. దర్యాప్తును పునః సమీక్షించాలని కోరారు. లేఖ‌లో సీబీఐ ఛార్జ్ సీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని.. ద‌ర్యాప్తు అధికారి రాంసింగ్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. అయితే అవినాష్ రెడ్డి లేఖ‌పై సీబీఐ నుంచి స్పంద‌న రాలేదు.

Updated On 14 Aug 2023 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story