YS Abhishek Reddy : వైఎస్ అభిషేక్‌రెడ్డి ఎవరు.. ఎలా చనిపోయాడు..!
వైఎస్ జగన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇతను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు,
వైఎస్ జగన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇతను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి కుమారుడు. కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధ పడుతూ హైదరాబాద్(Hyderabad)లోని ఏఐజీ(AIG) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా అభిషేక్‌రెడ్డి కొనసాగుతున్నాడు. అభిషేక్‌రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, వైఎస్ అభిషేక్‌రెడ్డికి భార్య డాక్టర్ సౌఖ్య(DR.Sowkya), పిల్లలు వైఎస్ అక్షర, వైఎస్ ఆకర్ష ఉన్నారు. అలాగే పులివెందుల నియోజకవర్గం లింగాల మండల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రచారంలో అభిషేక్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. కడప జిల్లాలో వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్ పాదయాత్రలోనూ అభిషేక్ రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. అభిషేక్‌రెడ్డి వైద్యవృత్తిలో ఉంటూనే పార్టీ కోసం పనిచేశారు