పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై డిటొనేటర్ దాడి జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే శంకర నారాయణ 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణ(MLA Sankaranarayana)కు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై డిటొనేటర్ దాడి జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే శంకర నారాయణ 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన వాహనం దిగి నడక ప్రారంభించారు. ఇంతలో ఓ వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటొనేటర్ విసిరాడు. ఆ డిటొనేటర్ పక్కనే ఉన్న పొలాల్లో పడడమే కాకుండా.. అది పేలలేదు. వెంటనే వైసీపీ నేతలు ఆ డిటొనేటర్ విసిరిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ ఎలక్ట్రికల్ డిటొనేటర్ కు పవర్ సప్లై లేకపోవడంతో అది పేలలేదని గుర్తించారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లి వాసి గణేశ్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో డిటొనేటర్ విసిరినట్టు భావిస్తున్నామని వెల్లడించారు.

ఎమ్మెల్యే శంకర నారాయణ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని.. కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలన్నారు. దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డానని.. డిటోనేటర్ పేలి ఉంటే ఘెర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నానని తెలిపారు.

Updated On 8 Oct 2023 7:30 AM GMT
Yagnik

Yagnik

Next Story