National Media Surveys : జాతీయ సర్వేలు, అసలు నిజాలు
లోక్‌సభ ఎన్నికలకు(Lok sabha Election) ముహూర్తం దగ్గరపడుతోంది. జాతీయ ఛానెళ్లకు ఎన్నికలంటే పెద్ద పండుగ! ఓ కార్నివాల్! తెగ హడావుడి చేస్తుంటాయి. ప్రజల మైండ్‌సెట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ఈ ఛానెళ్లను చక్కగా ఉపయోగించుకుంటుంది. జాతీయ ఛానెళ్లు అన్ని రాష్ట్రాలలో చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై జోస్యాలు చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు(Lok sabha Election) ముహూర్తం దగ్గరపడుతోంది. జాతీయ ఛానెళ్లకు ఎన్నికలంటే పెద్ద పండుగ! ఓ కార్నివాల్! తెగ హడావుడి చేస్తుంటాయి. ప్రజల మైండ్‌సెట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ఈ ఛానెళ్లను చక్కగా ఉపయోగించుకుంటుంది. జాతీయ ఛానెళ్లు అన్ని రాష్ట్రాలలో చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై జోస్యాలు చెబుతున్నారు. ఆ ఛానెళ్లు చేసేది సర్వేగా(Political survey) చూడటం కంటే జోస్యం చెబుతున్నాయనడమే కరెక్ట్! మరో పని లేనట్టుగా వరుసగా సర్వేలు చేస్తూ పోతున్నాయి. రిపబ్లిక్, ఎన్‌డిటీవీ, ఏబీపీ, సీఎన్‌బీసీ 18, ఆజ్‌తక్ ఇలా చాలా ఛానెళ్లు దేశ సమస్యలను గాలికి వదిలేసి సర్వే ఫలితాల కోసం గంటల గంటలు కేటాయిస్తున్నాయి. సర్వేలు చేస్తున్నది జాతీయ ఛానెళ్లు కాబట్టి వారు చెప్పింది పొల్లుబోకుండా నిజమవుతాయని, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే జరగబోతున్నదని భ్రమ పడాల్సిన అవసరం లేదు. భ్రమ అని ఎందుకంటున్నానంటే నిజం కాదు కాబట్టి. అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(Congress) గెలుస్తుందని చెప్పినా, ఇటు టీడీపీ(TDP) విజయం సాధిస్తుందని పేర్కొన్నా నమ్మాల్సిన పని లేదు. జన్‌మత్ సర్వేను ఎందుకు విశ్వసించాల్సి వస్తున్నదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు జన్‌మత్ చెప్పింది అక్షరాల నిజమయ్యింది కాబట్టి! ఏబీపీ, సీఎన్‌ఎన్ 18 ఛానెళ్లు చెప్పిన సర్వే ఫలితాలు ఏమిటంటే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బ్రహ్మండమైన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చాయి. సీ-ఓటర్ సర్వే ఎప్పుడూ నిజం కాలేదు. గత ఎన్నికల్లో సీ -ఓటర్ చెప్పిందేదీ వాస్తవ రూపం దాల్చలేదు. సీ-ఓటర్ ఎగ్జిట్‌పోల్స్ కూడా తప్పుల తడకగా ఉండింది. మెన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సీ ఓటర్ పప్పులో కాలేసింది. చత్తీస్‌గఢ్ విషయంలోనూ సేమ్‌టు సేమ్. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని చెప్పింది. కానీ అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని సీఎన్‌ఎన్-18 చెప్పిందంటే అసలు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ఛానెల్‌ను టీడీపీ ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందనేది నిజం! అది నిజమైన సర్వే కాదు, పెయిడ్ సర్వేగానే దాన్ని చూడాలి.