ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) దళితుల శిరోముండనం ఘటనకు సంబంధించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు(Thota Trimurthulu) 18 నెలల జైలు శిక్ష పడింది. ఈ కేసులో దాదాపు 28 ఏళ్లకు పైగా విచారణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు తోట త్రిమూర్తులు నేరం చేసినట్టుగా నిర్ధారించి తీర్పు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) దళితుల శిరోముండనం ఘటనకు సంబంధించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు(Thota Trimurthulu) 18 నెలల జైలు శిక్ష పడింది. ఈ కేసులో దాదాపు 28 ఏళ్లకు పైగా విచారణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు తోట త్రిమూర్తులు నేరం చేసినట్టుగా నిర్ధారించి తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం త్రిమూర్తులు మండపేట నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. దళిత యువకులను హింసించి ఇద్దరికి శిరోముండటం చేసిన త్రిమూర్తులకు వైసీపీ టికెట్ ఎలా ఇచ్చిందని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని చెప్పింది. 1994 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసిన అభ్యర్థి అనుచరులు తోట త్రిమూర్తులు రిగ్గింగ్‌ చేస్తుండగా నిలదీశారు. రిగ్గింగ్‌ కాకుండా నిలువరించగలిగారు. అది మనసులో పెట్టుకుని రగిలిపోయారు త్రిమూర్తులు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దళిత యువకులపై కసి పెట్టుకున్నారు. 1996 డిసెంబర్ 29వ తేదీన రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న ఆయన స్వగ్రామం వెంకటాయపాలెంలో అయిదుగురు దళిత యువకులపై దాడి జరిగింది. తోట త్రిమూర్తులు కుటుంబానికి చెందిన వారు ఈ దాడిలో పాల్గొన్నారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ(TDP) తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి, 1998లో వెంకటాయపాలెం శిరోముండనం కేసు విచారణను నిలిపివేసింది.

కేసును రద్దు చేస్తూ జీవో కూడా విడుదల చేసింది చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం. దాంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డెక్కారు. దళిత సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు వీరికి మద్దతుగా నిలిచాయి. ఉద్యమాలు చేపట్టాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు హైకోర్టును ఆశ్రయంచారు. కోర్టు ఆదేశాల మేరకు 2000లో జస్టిస్ పుట్టు స్వామి కమిషన్ నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసు నుంచి కేవలం తోట త్రిమూర్తులు పేరు మాత్రమే తొలగిస్తూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. దానిని కూడా బాధితులు తప్పుబట్టారు. తోట త్రిమూర్తులు పాత్ర ఉందంటూ మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో 2008లో మరోసారి ఈ కేసు రీ ఓపెన్ అయ్యింది. చంద్రబాబు హయంలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి బాధితులను ఆదుకునే బాధ్యత చంద్రబాబుపై ఉంటుంది. ప్రస్తుతం త్రిమూర్తులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(Congress) నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అతడి టికెట్‌ రద్దు చేయాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. నిజంగానే రెండు పార్టీలకు దళితుల మీద ప్రేమ ఉందా అనుమానం కలుగుతోంది ఈ ఇన్సిడెంట్‌ చూస్తుంటే! ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రకం!రెండు పార్టీలకు దళిత యువకుల మీద జాలి, ప్రేమ, కరుణ ఉంటే బాధితులకు టికెట్‌ ఇచ్చి గెలిపించుకోవాలి.

Updated On 18 April 2024 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story