PM Narendra Modi : టీడీపీ మీడియాపై బీజేపీ అధిష్టానం కన్నెర్ర!
ఆంధ్రప్రదేశ్‌లో(AP) తెలుగుదేశంపార్టీ(TDP) మీడియాపై భారతీయ జనతాపార్టీ కేంద్ర నాయకత్వం ఆగ్రహంగా ఉంది. బీజేపీ(BJP) కేంద్రనాయకత్వానికి టీడీపీ మీడియాపైన వచ్చిన కోపం ఇప్పటిదేం కాదు. చాలా కాలం నుంచే ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మీడియాపై బీజేపీకి ఉన్న కోపం మరోసారి బయటపడింది. ఆ ఆగ్రహం ఇప్పుడు మరింత తీవ్రమైంది. అందుకు కారణం టీడీపీ మీడియా చేస్తున్న ఓవరాక్షన్.
ఆంధ్రప్రదేశ్‌లో(AP) తెలుగుదేశంపార్టీ(TDP) మీడియాపై భారతీయ జనతాపార్టీ కేంద్ర నాయకత్వం ఆగ్రహంగా ఉంది. బీజేపీ(BJP) కేంద్రనాయకత్వానికి టీడీపీ మీడియాపైన వచ్చిన కోపం ఇప్పటిదేం కాదు. చాలా కాలం నుంచే ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మీడియాపై బీజేపీకి ఉన్న కోపం మరోసారి బయటపడింది. ఆ ఆగ్రహం ఇప్పుడు మరింత తీవ్రమైంది. అందుకు కారణం టీడీపీ మీడియా చేస్తున్న ఓవరాక్షన్. టీడీపీతో బీజేపీకి పొత్తు కుదిరిన తర్వాత కూడా పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతున్న సందర్భంలో కూడా భారతీయ జనతాపార్టీని, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని(PM narendra Modi) ఉద్దేశించి తెలుగుదేశంపార్టీ మీడియా రాసిన రాతలు, మాట్లాడిన మాటలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి చేరాయి. వీటిని కేంద్ర నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. గతంలో కూడా 2019 ఎన్నికల సందర్భంగా మొత్తం బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విలన్‌గా చూపించడం కోసం రకరకాల కథనాలను వండి వార్చింది టీడీపీ మీడియా. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్న సందర్భంలో కూడా టీడీపీ మీడియా ఇష్టం వచ్చినట్టుగా రాసింది. పొత్తు పెట్టుకోకపోతే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తామని, ఏపీ ప్రజలకు ఓ బూచిగా చూపిస్తామని టీడీపీ మీడియా బెదిరించిందట కూడా! ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ నరరూప రాక్షసుడిగా అభివర్ణిస్తూ టీడీపీ మీడియా రాసింది. ఛానెళ్లలో కూడా ఇలాగే ప్రసారమయ్యింది. దీనిపై రాష్ర్ట బీజేపీ నాయకత్వం వీటిని చూసి చూడనట్టు వదిలేసింది. టీడీపీ కూడా లైట్ తీసుకుంది. ఇలా రాయడం తప్పని కూడా టీడీపీ చెప్పలేదు. వీటన్నింటినీ గమనించిన తర్వాత టీడీపీ మీడియా(TDP Media) ఎప్పటికీ బీజేపీ పట్ల వ్యతిరేక ధోరణితోనే ఉందని అర్థమవుతోంది. ఓ రకమైన బ్లాక్ మెయిలింగ్ అన్నమాట! టీడీపీ మీడియా సంగతేమిటో బీజేపీ అధినాయకత్వానికి అర్థమయ్యింది. బీజేపీ ఈసారి దక్షిణాదిపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. సౌత్‌లో వీలైనన్ని సీట్లు సాధించాలని గట్టిగా ప్రయత్నించింది. గత పదేళ్లలో మీడియాకు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వని మోదీ ఈసారి కావాల్సిన వారందరికీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్టీవీకి, టీవీ9కు మోదీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈనాడుకు సంబంధించిన పత్రికకు కూడా మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగుదేశంపార్టీ కోసం చొక్కాలు చించుకుని అతిగా ప్రవర్తిస్తుంటుందో, జర్నలిజం అంటే ఇదా అని సామాన్య ప్రజలు కూడా అసహ్యించుకునే స్థాయిలో ప్రవర్తిస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ తప్ప మరే ఇతర పార్టీలు ఉండకూడదని భావిస్తూ తమ మీడియాలో టీడీపీని ఆకాశానికి ఎత్తేస్తూ భజనలు చేస్తూ వస్తున్న ఓ పత్రికాధిపతిని మాత్రం బీజేపీ దూరం పెట్టింది. ఆ పత్రికాయజమానికి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదో అర్థం అవుతుంది.