ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వాలంటీర్ల(Volunteers) వ్యవస్థపై పెద్ద చర్చ నడుస్తోంది. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం(ELection Commission ) ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లు విధులకు దూరంగా ఉంటున్నారు. లేటెస్ట్‌గా వాలంటీర్లకు సంబంధించి ఈసీ మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల, వచ్చే నెల వాలంటీర్లు పెన్షన్‌ల పంపిణీ చేయకూడదని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వాలంటీర్ల(Volunteers) వ్యవస్థపై పెద్ద చర్చ నడుస్తోంది. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం(ELection Commission ) ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లు విధులకు దూరంగా ఉంటున్నారు. లేటెస్ట్‌గా వాలంటీర్లకు సంబంధించి ఈసీ మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల, వచ్చే నెల వాలంటీర్లు పెన్షన్‌ల పంపిణీ చేయకూడదని చెప్పింది. ఎన్నికల కమిషన్‌ చెప్పిన ప్రకారం ఇప్పుడు పెన్షన్‌లను(Pensions) ఎవరు పంపిణీ చేయలన్నదానిపైన ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగులు పెన్షన్‌లను పంపిణీ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు కూడా సచివాలయానికి వచ్చి పెన్షన్‌ తీసుకోవలసి ఉంటుంది. దీనిపైన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ, ఆ పార్టీకి వత్తాసుపలికే మీడియా ఇప్పుడు మాట మార్చింది. వృద్ధులను అంత దూరం తిప్పిస్తారా? సచివాలయ సిబ్బందినే ఇంటికి పంపించి పెన్షన్‌లు ఇవ్వవచ్చని అని పచ్చ మీడియా అంటోంది. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని, అందుకే పెన్షన్‌ల పంపిణీని ఆలస్యం చేస్తున్నదని ఆరోపిస్తోంది. ప్రభుత్వం కుట్రపూరితంగానే పెన్షన్‌లను ఆపేసిందని అభూత కల్పనలు రాసింది. ప్రతిపక్ష పార్టీల కంటే టీడీపీ మీడియానే ఎక్కువగా ఆక్రోశిస్తున్నది. పెన్షన్లు ఆలస్యం కావడానికి, వృద్దులు, దివ్యాంగులు సచివాలయం వరకు వెళ్లవలసిన దుస్థితికి కారణం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. సర్వీసు నుంచి రిటైరయ్యాక ఆయన సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో జగన్‌ వ్యతిరేక బ్యూరోకాట్లు అందరూ చేరారు. నిమ్మగడ్డ ఏం చేశారంటే వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలంటూ ఈసీకి ఓ ఉత్తరం రాశారు. ఎన్నికల సంఘం పెన్షన్‌లను వాలంటీర్లు పంచవద్దంటూ ఆదేశించింది. అంతేనా వాలంటీర్లపై ఇష్టం వచ్చిన రాతలు రాశారు. పెన్షన్లు ఆగిపోవడానికి నూటికి నూరుశాతం టీడీపీ, ఆ పార్టీని భుజాలపై మోస్తున్న ఓ పత్రికనే కారణం. టీడీపీ మీడియా వికృత రాతలు ఎలా ఉంటాయో తెలుసుగా! ఇప్పుడు జగన్‌ వల్లే అంటూ పిచ్చి రాతలు రాస్తున్నది.

Updated On 1 April 2024 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story