ప్రశాంత్ కిశోర్‌(Prashanth Kishore).. పీకేగా ప్రసిద్ధుడైన ఈ ఎన్నికల వ్యూహకర్తను రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. 2014లో నరేంద్రమోదీ(Narendra modi) ప్రధానమంత్రి కావడం కోసం పకడ్బందీ వ్యూహాన్ని రచించింది ప్రశాంత్ కిశోరే! ఆ తర్వాత పీకేకు డిమాండ్‌ పెరిగింది. అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. ఆ పార్టీల గెలుపులో భాగమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ- కాంగ్రెస్‌ పార్టీల కూటమి కోసం కూడా పీకే పని చేశారు.

ప్రశాంత్ కిశోర్‌(Prashanth Kishore).. పీకేగా ప్రసిద్ధుడైన ఈ ఎన్నికల వ్యూహకర్తను రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. 2014లో నరేంద్రమోదీ(Narendra modi) ప్రధానమంత్రి కావడం కోసం పకడ్బందీ వ్యూహాన్ని రచించింది ప్రశాంత్ కిశోరే! ఆ తర్వాత పీకేకు డిమాండ్‌ పెరిగింది. అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. ఆ పార్టీల గెలుపులో భాగమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ- కాంగ్రెస్‌ పార్టీల కూటమి కోసం కూడా పీకే పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే గడచిన ఎన్నికల్లో ఈయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. జగన్మోహన్‌ రెడ్డి(Jagam Mohan Reddy) గెలుపు కోసం కృషి చేశారు. ఆ తర్వాత తాను ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ ప్రకటన చేశారు. పార్టీల కోసం పని చేయడం మానేసి బీహార్‌లో భారీ పాదయాత్ర చేపట్టారు. బీహార్‌లోనే కాదు, దేశంలోనే మార్పు తీసుకువస్తానని చెప్పారు. ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్త మాత్రమే! ఆయనెప్పుడూ సర్వేలు నిర్వహించలేదు. ఇప్పుడాయన అడపాదడపా నేషనల్‌ ఛానెల్స్‌లో చర్చా కార్యక్రమాల కోసం వెళుతున్నారు. తన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఇదే తరహాలో కొద్ది రోజుల కిందట తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడును(Chandrababu) కలిశారు. ఆ సమయంలో టీడీపీ కోసం పీకే పని చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు టీడీపీ ఖండించలేదు కానీ, రెండు వారాల తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ నుంచే ఓ స్పష్టత వచ్చింది. తమను కలవాల్సిందిగా టీడీపీ అధినాయకత్వం నుంచి పదే పదే కబురు వస్తుండటంతో వెళ్లి కలిశానే తప్ప ఇందులో రాజకీయపరమైన అంశాలేవీ లేవని పీకే చెప్పేశారు. బాబును కర్టసీ కోసమే కలిశాను తప్ప ఆ పార్టీతో పని చేయడం లేదని స్పష్టం చేశారు. తాజాగా హైదరాబాద్‌ వేదికగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీ అనుకూల మీడియాలో హైలైట్‌ అవుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి ఓడిపోబోతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదు. తెలుగుదేశంపార్టీ ఘన విజయం తథ్యం.. ఇవి ఆయన చెప్పిన మాటలు. ఇందుకు ఆయన కొన్ని లాజిక్కులు చెప్పుకొచ్చారు. పప్పుబెల్లాల్లాగా డబ్బును ప్రజలకు పంచేసి జగన్‌ ప్యాలెస్‌లో కూర్చుని పని చేస్తున్నారని అన్నారు. ప్రజలు కోరుకుంటున్నది విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు అని, అవి సమకూర్చని ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేయరని తెలిపారు. ఆయన చెప్పిన ఈ లాజిక్‌ డొల్లతనంగా ఉంది. ఆయన ఎందుకో ఓ సైడ్‌ తీసుకుని మాట్లాడుతున్నారని అనిపిస్తోంది. తెలంగాణలో కూడా ఇలా పంచడం వల్లే కేసీఆర్‌ ఓడిపోయారంటూ పీకే కామెంట్‌ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రశాంత్‌ కిశోరే.. ఈ పెద్ద మనిషే కేసీఆర్‌ విజయం సాధించబోతున్నారని చెప్పారు. ఒక్కసారి కాదు, చాలా సార్లు ఈ విషయం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచింది కూడా ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పడం వల్లనే! అలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు వ్యతిరేకిస్తే కాంగ్రెస్‌ గెలవకూడదు కదా మరి! ఇదే లాజిక్కో అర్థం కావడం లేదు. దీనికి పీకేనే జవాబు చెప్పాలి. పప్పుబెల్లాల్లా పంచుతున్నారు. ప్యాలెస్‌ కూర్చొని జగన్ బటన్ నొక్కుతున్నారు.. ఈ రకమైన సెంటెన్స్‌లకు పేటెంట్‌ హక్కు టీడీపీ అనుకూల మీడియాకే ఉంది. పొద్దున లేచినకాడినుంచి ఇవే పదాలు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్‌ రికార్డులా వల్లెవేస్తుంటోంది టీడీపీ అనుకూల మీడియా. ఇవే పదాలు ప్రశాంత్‌ కిశోర్‌ నోటి వెంట వస్తున్నాయంటే ఆ మీడియా వార్తలనే పీకే ఎక్కువగా చూస్తున్నారు, ఎక్కువగా చదువుతున్నారని అర్థమవుతోంది.

Updated On 4 March 2024 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story