TDP Wrong Decision : టీడీపీని భ్రష్టుపట్టించే ఆలోచన..!
త్వరలో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్(MP CM Ramesh), వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ(TDP) ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్(Kanakamedala Ravindra Kumar) స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే రాజ్యసభ స్థానం దక్కించుకోవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికే ఈ మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది.

TDP Wrong Decision
త్వరలో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్(MP CM Ramesh), వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ(TDP) ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్(Kanakamedala Ravindra Kumar) స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే రాజ్యసభ స్థానం దక్కించుకోవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికే ఈ మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే టీడీపీకి ఉన్న 23 ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీకి వెళ్లగా.. అదే సమయంలో వైసీపీ నుంచి నలుగురు అసంతృప్తుల ఓట్లు వేసుకొని ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. అయితే రాజ్యసభ స్థానం విషయంలోనూ టీడీపీ పోటీ చేయాలని యోచిస్తోందని సమాచారం. అదే జరిగితే ఆ పార్టీ అధినేత చంద్రబాబును సీనియర్లు భ్రష్టుపట్టిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. 23 మంది సభ్యులతో రాజ్యసభ స్థానం ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు.. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ వైఎన్‌ఆర్ పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి..
