Alla Ramakrishna Reddy : ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వెనుక ఏం జరిగింది?
మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) తన పదవికి, పార్టీకి రాజీనామా(Resign) చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రామకృష్ణారెడ్డి తెలియనివారు ఉండరు. కిందటి ఎన్నికల్లో నారా లోకేశ్‌ను(Nara Lokesh) ఓడించింది ఆళ్ల రామకృష్ణారెడ్డే! తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రభుత్వం తీసుకున్న అనేకానేక వివాదాస్ప నిర్ణయాలపై కోర్టుకు వెళ్లింది కూడా ఈయనే! రాజధాని భూముల విషయంలో రైతుల తరఫున పోరాడిన పేరు ఆళ్లకు ఉంది.
మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) తన పదవికి, పార్టీకి రాజీనామా(Resign) చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రామకృష్ణారెడ్డి తెలియనివారు ఉండరు. కిందటి ఎన్నికల్లో నారా లోకేశ్‌ను(Nara Lokesh) ఓడించింది ఆళ్ల రామకృష్ణారెడ్డే! తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రభుత్వం తీసుకున్న అనేకానేక వివాదాస్ప నిర్ణయాలపై కోర్టుకు వెళ్లింది కూడా ఈయనే! రాజధాని భూముల విషయంలో రైతుల తరఫున పోరాడిన పేరు ఆళ్లకు ఉంది. పలువురు రైతులతో(Farmer) ప్రభుత్వంపై కేసులు పెట్టించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కారణంగానే అమరావతిలోని కొన్ని సామాజికవర్గాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఓటేశాయి. మొదటిసారి అసెంబ్లీ పోరు బరిలో దిగినప్పుడు ఆళ్లకు వచ్చిన మెజారిటీ చాలా స్వల్పం. అదే 2019లో మాత్రం నారా లోకేశ్‌పై బ్రహ్మాండమైన ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే గత కొద్ది కాలంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిజానికి ఆళ్ల మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవి ఇస్తానని జగన్ కూడా హామీ ఇచ్చారు. కాని ఇచ్చిన హామీని జగన్(Jagan) నిలబెట్టుకోలేదు. ఆళ్లకు మంతరి పదవి ఇవ్వలేదు. అప్పట్నుంచే ఆళ్లలో అసంతృప్తి బీజం పడింది. తర్వాత తన సోదరుడు ఆళ్ల ఆయోధ్య రామరెడ్డికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడంతో కొన్నాళ్ల పాటు పార్టీ పట్ల విధేయుడిగానే ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణలో తనకు తప్పక అవకాశం లభిస్తుందని భావించారు. అప్పుడు కూడా ఆళ్లకు నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ పట్ల, అధినేత పట్ల అసంతృప్తితో ఉన్నారనే వార్తలు చాలానే వచ్చినప్పటికీ ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్టీలో తనకు బాగానే ఉందని, జగన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ టికెట్ ఇస్తే మళ్లీ పోటీ చేస్తానని రామృష్ణారెడ్డి పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. ఆళ్ల అసంతృప్తికి మంత్రి పదవో, మరోటో కాదు. తనకు తెలియకుండా నియోజకవర్గానికి సంబంధించి, నియోజవర్గంలో పార్టీకి సంబధించిన కొన్ని నిర్ణయాలు తనకు తెలియకుండా జరుగుతున్నాయన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి భావన. మురుగుడు హనుమంతరావును పార్టీలో తీసుకుంటున్న విషయాన్ని తనతో చర్చింకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆళ్ల ఆవేదన చెందిన మాట వాస్తవం. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఎలాగూ రాదని తెలిసే ఆళ్ల పార్టీకి, పదవికి రాజీనామా చేశారా? అంటే అవుననే జవాబు వస్తుంది. అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వెనుక ఏం జరిగింది? ఈ వీడియోలో వివరంగా చూడండి.