Sowbhagyamma : తెలుగుదేశంపార్టీ ట్రాప్‌లో వివేకానందరెడ్డి ఫ్యామిలీ?
దివంగత వై.ఎస్.వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy ) సతీమణి సౌభాగ్యమ్మ(Sowbhagyamma) తెలుగుదేశంపార్టీ నుంచి కడప(Kadapa) లోక్‌సభకు పోటీ చేస్తారంటూ టీడీపీ(TDP) అనుకూల మీడియా రాస్తోంది. ఇది కొత్తగా ఏమీ అనిపించలేదు. అనూహ్యమని అనిపించలేదు. ఆ వార్త చదవి ఆశ్చర్యం కూడా కలగలేదు. అంటే తెలుగుదేశంపార్టీతో వైఎస్ వివేకా ఫ్యామిలీ టచ్‌లో ఉంది. టీడీపీకి వివేకా ఫ్యామిలీని దగ్గర చేసే పనిని ఓ పెద్ద మనిషి భుజాన వేసుకున్నారు.
దివంగత వై.ఎస్.వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy ) సతీమణి సౌభాగ్యమ్మ(Sowbhagyamma) తెలుగుదేశంపార్టీ నుంచి కడప(Kadapa) లోక్‌సభకు పోటీ చేస్తారంటూ టీడీపీ(TDP) అనుకూల మీడియా రాస్తోంది. ఇది కొత్తగా ఏమీ అనిపించలేదు. అనూహ్యమని అనిపించలేదు. ఆ వార్త చదవి ఆశ్చర్యం కూడా కలగలేదు. అంటే తెలుగుదేశంపార్టీతో వైఎస్ వివేకా ఫ్యామిలీ టచ్‌లో ఉంది. టీడీపీకి వివేకా ఫ్యామిలీని దగ్గర చేసే పనిని ఓ పెద్ద మనిషి భుజాన వేసుకున్నారు. గత మూడేళ్లుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సౌభాగ్యమ్మనే ఎందుకు బరిలో దింపుతున్నారు? సునీతారెడ్డిని కానీ, ఆమె భర్తను కానీ ఎందుకు బరిలో దించడం లేదు? సునీతారెడ్డి మాత్రమే గత నాలుగేళ్లుగా ప్రజలకు కనిపిస్తున్నారు. తన తండ్రిని చంపినవారిని పట్టుకుని శిక్షించాలంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రజలకు తెలిసిన సునీతారెడ్డిని(Sunitha Reddy) కాకుండా సౌభాగ్యమ్మను ఎందుకు తెరమీదకు తెస్తున్నారంటే దాని వెనుక రకరకాల కారణాలున్నాయి. అయితే ఇక్కడ వై.ఎస్. వివేకా హత్య వెనుక ఎవరున్నారు అనే విషయం ఎప్పటికీ తేలకుండా ఉండే ప్రమాదం ఉంది. వైఎస్ సునీతారెడ్డి తెలుగుదేశంపార్టీ ట్రాప్‌లో ఉండటం కారణంగా వివేకానందరెడ్డి హంతకులకు మేలు జరిగేలా ఉంది. వై.ఎస్.సౌభాగ్యమ్మ పేరును ఎందుకు తెరమీదకు తీసుకొచ్చారంటే వివేకానందరెడ్డి కూతురు, అల్లుడు ఇద్దరూ అమెరికా సిటిజన్లు. వారిద్దరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. గతంలోనే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి దగ్గుబాటు వెంకటేశ్వరరావు కూమారుడికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీ టికెట్ ఇవ్వాలని అనుకుంది. ఆయన కూడా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సిటిజన్‌షిప్ వివాదం కారణంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావే బరిలో దిగాల్సి వచ్చింది. ఇటీవల తెలంగాణలోని పాలకుర్తిలో యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నిజానికి ఇక్కడ్నుంచి యశస్విని రెడ్డి అత్తగారు ఝాన్సీ పోటీ చేయాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం అడ్డుపడింది. ఆమె అమెరికా సిటిజన్ కావడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. దాంతో కోడలిని బరిలో దింపారు ఝాన్సి. సునీతారెడ్డి, ఆమె భర్త విషయం కూడా అంతే! ఇద్దరూ అమెరికా పౌరసత్వం కలవారు కాబట్టి వారు పోటీ చేయడానికి కుదరదు. ఈ కారణంగానే సౌభాగ్యమ్మ పేరు తెరమీదకు తెచ్చారు. వివేకా హత్య తర్వాత సౌభాగ్యమ్మ ఎప్పుడూ బయటకు రాలేదు. తన భర్త హత్యను చేసిన వారికి శిక్ష పడాలంటే మీడియాలో మాట్లాడలేదు. నిజానికి అవినాష్‌రెడ్డికి మద్దతుగా వైఎస్ కుటుంబ సభ్యులు చాలా మంది మాట్లాడారు. ఈ విషయం అలా ఉంచితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలు. ఆమె కూడా సునీతారెడ్డికి సపోర్ట్‌గా నిలిచారు. తన బాబాయ్‌ను చంపినవారెవరో తెలియాలని, వారికి కఠిన శిక్ష పడాలని షర్మిల చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా సునీతారెడ్డికి మద్దతుగా నిలుస్తోంది. ఇప్పుడు సౌభాగ్యమ్మ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి చేయాలి కదా! లేదూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నిస్తుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయవచ్చు. అంతే కానీ తెలుగుదేశంపార్టీ నుంచి పోటీ చేయడమేమిటి?