YS Sharmila : కాంగ్రెస్ ఎజెండా పక్కకు, వ్యక్తిగత ఎజెండా ముందుకు!
వైఎస్ షర్మిల(YS sharmila) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(APCC) పగ్గాలు చేపట్టిన తర్వాత అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP), ఇటు తెలుగుదేశంపార్టీలపై విమర్శలు గుప్పించారు. రెండో రోజు నుంచి కేవలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. పోలవరం విషయంలో, ప్రత్యేకహోదా విషయంలో, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, విభజన హామీల విషయంలో, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ విషయంలో, వైజాగ్ రైల్వే జోన్(Vizag railway zone) విషయంలో రెండు పార్టీలు విఫలమయ్యాయంటూ దుయ్యబట్టారు షర్మిల.
వైఎస్ షర్మిల(YS sharmila) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(APCC) పగ్గాలు చేపట్టిన తర్వాత అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP), ఇటు తెలుగుదేశంపార్టీలపై విమర్శలు గుప్పించారు. రెండో రోజు నుంచి కేవలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. పోలవరం విషయంలో, ప్రత్యేకహోదా విషయంలో, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, విభజన హామీల విషయంలో, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ విషయంలో, వైజాగ్ రైల్వే జోన్(Vizag railway zone) విషయంలో రెండు పార్టీలు విఫలమయ్యాయంటూ దుయ్యబట్టారు షర్మిల. భారతీయ జనతాపార్టీ ప్రాపకం కోసం వైసీపీ, టీడీపీ(TDP), జనసేనలు(Janasena) పడరాని పాట్లు పడుతున్నాయన్నారు. ఈ మూడు పార్టీలు బీజేపీ కోసమే పని చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి(BJP) ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేకపోయినా ఏపీలో ఆ పార్టీ పాలిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బీజేపీకి ఊడిగం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, వీటికి సంబంధించిన ప్రయారిటీ, ప్రచారం తక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె చేస్తున్న విమర్శలు, జగన్(Jagan) లక్ష్యంగా ఆమె మాట్లాడుతున్న మాటలు చిత్రంగా ఉంటున్నాయి. తన అన్న జగన్ తనను మోస చేశాడని, ఇంట్లోంచి గెంటేశాడని, కుటుంబానికి అన్యాయం చేశాడు ఇంటి వ్యాఖ్యలను వైఎస్ షర్మిల చేస్తూ వస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ఎన్నికలకు వెళుతుందనే విషయం పక్కదారి పట్టి వైఎస్ షర్మిలకు, జగన్ మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని, ఆ గొడవల కారణంగానే షర్మిల బయటకు వచ్చి పార్టీ పెట్టారని జనం అనుకోసాగారు. ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే గడచిన పదేళ్ల కాలంలో రెండు పార్టీల పరిపాలన రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి, ఈ రెండు పార్టీల ద్వారా ఏ రకంగా రాష్ట్రానికి నష్టం జరిగింది అన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా లాభం చేకూరుతుందో కూడా చెప్పాలి. అప్పుడే ప్రజలు కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలుస్తారు. వైఎస్ షర్మిల కూడా దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. షర్మిల ప్రసంగాలు ఎందుకు ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయి? వివరాలు ఈ వీడియోలో చూడండి.