APCC Chief YS sharmila : ఎత్తుగడ ఓకే! ఎజెండా నాట్ ఓకే!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల(YS sharmila) బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవిని తీసుకున్న తర్వాత ఒక ఎత్తుగడతో రాజకీయ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఆమె తెలుగుదేశం పార్టీ(TDP), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలపై(YSRCP) విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల విధివిధానాలను విమర్శించడం ద్వారానే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించవచ్చని షర్మిల భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల(YS sharmila) బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవిని తీసుకున్న తర్వాత ఒక ఎత్తుగడతో రాజకీయ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఆమె తెలుగుదేశం పార్టీ(TDP), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలపై(YSRCP) విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల విధివిధానాలను విమర్శించడం ద్వారానే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించవచ్చని షర్మిల భావిస్తున్నారు. ఈ ఎత్తుగడ బాగానే ఉంది కానీ, ఎజెండానే బాగోలేదు. రెండు పార్టీలను విమర్శించే క్రమంలో వైసీపీపై కొన్ని విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీపై ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంపై విమర్శలు చేశారు. ప్రత్యేకహోదాకు సంబంధించి టీడీపీ ఏం చేసింది? ఎలా వ్యవహరించింది? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఏం చెప్పింది? ఎలా నష్టాన్ని కలిగించిందనేది షర్మిల బహిరంగసభలో తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్‌పైనా చేసిన విమర్శలే బాగోలేవు. అవన్నీ ప్రతిపక్షాలు చేసిన విమర్శలులానే ఉన్నాయి. టీడీపీ ఏ విమర్శలు అయితే చేసిందో సేమ్ టు సేమ్ అవే విమర్శలను షర్మిల చేశారు. ఈ ఎత్తుగడ కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది.