వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధినాయకురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) కొత్త భూమికను పోషించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి(AP congress) సారథ్యం వహించబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసినా, బీఆర్‌ఎస్‌(BRS) నేతలను బండబూతులు తిట్టినా ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల సమయానికి తనకు ఆదరణ లేదన్న విషయాన్ని గ్రహించారు షర్మిల. కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌గాంధీలను కలుసుకున్నారు. వారిద్దరిని పొగిడారు. కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనానికి డెడ్‌లైన్‌ విధించారు. అయినప్పటికీ ఆ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్‌ రాలేదు. వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి తెలంగాణ వ్యాప్తంగా తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించారు. రెండు రోజులైనా కాకముందే యూటర్న్‌ తీసుకున్నారు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధినాయకురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) కొత్త భూమికను పోషించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి(AP congress) సారథ్యం వహించబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసినా, బీఆర్‌ఎస్‌(BRS) నేతలను బండబూతులు తిట్టినా ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల సమయానికి తనకు ఆదరణ లేదన్న విషయాన్ని గ్రహించారు షర్మిల. కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌గాంధీలను కలుసుకున్నారు. వారిద్దరిని పొగిడారు. కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనానికి డెడ్‌లైన్‌ విధించారు. అయినప్పటికీ ఆ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్‌ రాలేదు. వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి తెలంగాణ వ్యాప్తంగా తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించారు. రెండు రోజులైనా కాకముందే యూటర్న్‌ తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల బరిలోంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నుంచి ఆమెకు కించిత్‌ మెచ్చుకోలు కూడా లభించలేదు. కనీసం ఈమెను గుర్తించను కూడా గుర్తించలేదు. తమ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వైఎస్‌ షర్మిల పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు. బ్లాక్‌ మెయిలర్లు, దొంగలు ముఖ్యమంత్రులు కాలేరంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి షర్మిల కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత రేవంత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి షర్మిలకు ఆహ్వానం అందలేదు. ఆ తర్వాత జరిగిన ఏ కార్యక్రమానికి షర్మిలను పిలవలేదు. గెలిచిన 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఒక్కరంటే ఒక్కరు కూడా షర్మిలను కలవలేదు. కృతజ్ఞతలు చెప్పుకోలేదు. ఖమ్మం జిల్లాలో తాను పోటీ చేయాలనుకున్న పాలేరు స్థానాన్ని వదిలేసినా ఖమ్మం జిల్లా నుంచి ఒక్క నాయకుడు కూడా షర్మిలను కలిసి కృతజ్ఞతలు చెప్పలేదు. తెలంగాణ కాంగ్రెస్‌ ఆమెను పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టానంటూ, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చిన షర్మిల ఇప్పడు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్నారు. ఏపీకి వెళితే అక్కడి ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? పక్క రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వెళ్లిన షర్మిల ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తారంటూ ప్రజలు నిలదీస్తున్నారు. షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసి ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ను చేస్తారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. సరే, ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టి ఏపీ కాంగ్రెస్‌ కోసం పని చేయడం మొదలు పెట్టారే అనుకుందాం! షర్మిల ఏపీకి రావాలని తెలుగుదేశం పార్టీ మీడియా బలంగా కోరుకుంటోంది. నిజానికి ఆమెను నడిపిస్తున్నదే టీడీపీ(TDP) మీడియా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్‌కు వెళితే ఏం జరుగుతుంది? తెలుగుదేశంపార్టీకి మంచి జరగబోతున్నదంటూ ఓ సెక్షన్‌ ఆఫ్‌ మీడియా రాస్తోంది. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? జగన్‌(Jagan) ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని టీడీపీ చెబుతూ వస్తోంది. ఆ తర్వాత జనసేన కూడా కలిస్తే బాగుండు కదా అని భావించింది. జనసేన కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది. టీడీపీ-జనసేన కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అంటున్నారు. బీజేపీ కూడా మనతో ఉంటే బాగుంటుందని మనసులో మాట బయటకు చెప్పాయి టీడీపీ, జనసేన(Janasena) పార్టీలు. ఇదిలా ఉంచితే షర్మిలతో అన్న జగన్‌తో తిట్టించాలన్నది టీడీపీ అనుకూల మీడియా ఆలోచన. నిజానికి షర్మిల కాంగ్రెస్‌ పార్టీకి పనిచేస్తే నష్టం జరిగేది టీడీపీకే! ఏపీలో క్రిస్టియన్లు, మైనారిటీలు, దళితులు జగన్ వెంట ఉన్నారు. టీడీపీకి బీసీలు దూరం కావడం వల్లే కిందటిసారి వైసీపీ గెలవగలిగింది. ఈసారి బీసీలు తమవైపు వస్తారనే నమ్మకంతో టీడీపీ ఉంది. వీరిని వైఎస్‌ షర్మిల తనవైపుకు తిప్పుకుంటే తాము గెలుస్తామని టీడీపీ అనుకుంటోంది. జగన్‌ను వ్యతిరేకించే వ్యక్తులు, ఓటర్లు చీలిపోవడం టీడీపీకి ఏ రకంగా లాభం? ప్రజలలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను కాదని ఈసారి కొత్తవారిని టికెట్లు ఇస్తున్నారు జగన్‌. అలా పార్టీ టికెట్‌ దొరకనివారంతా షర్మిల దగ్గరకు వెళతారనుకుందాం! వారందరికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇస్తుందనే అనుకుందాం! అప్పుడు జగన్‌ వ్యతిరేక ఓట్లు ఎటు వెళతాయి? అందులో కొన్ని షర్మిల పార్టీకి వెళతాయి కదా!వ్యతిరేక ఓట్లు చీలడం ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? సింపుల్‌.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కే కదా! షర్మిల ఒంటరిగా పోటీ చేస్తే కచ్చితంగా టీడీపీకే నష్టం. ఈ విషయం తెలిసో , తెలియకో, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నదో తెలియదు కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోదు కదా! పోనీ బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేసిందనే అనుకుందాం! అప్పుడు షర్మిల ఒంటరిగానే పోటీ చేస్తుంది కదా! అసలు ఏ రకంగా చూసినా ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల నాయకత్వం వహిస్తే జరిగే నష్టం టీడీపీకే!

Updated On 26 Dec 2023 6:51 AM GMT
Ehatv

Ehatv

Next Story