దావోస్‌లో(Davos) వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(World Economic Forum) జరుగుతోంది. ప్రతి ఏడాది జనవరిలో ఈ సదస్సు జరుగుతూ ఉంటుంది. ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ఆయా ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. పెట్టుబడులను ఆహ్వానిస్తారు. తమ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే ఫలానా ఫలానా ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ పవర్‌పాయింట్(PPT) ప్రజెంటేషన్‌ ఇస్తారు. అనేక సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది.

దావోస్‌లో(Davos) వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(World Economic Forum) జరుగుతోంది. ప్రతి ఏడాది జనవరిలో ఈ సదస్సు జరుగుతూ ఉంటుంది. ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ఆయా ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. పెట్టుబడులను ఆహ్వానిస్తారు. తమ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే ఫలానా ఫలానా ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ పవర్‌పాయింట్(PPT) ప్రజెంటేషన్‌ ఇస్తారు. అనేక సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి(CM Jagan) వెళ్లలేదు. దావోస్‌కు ముఖ్యమంత్రి వెళ్లకపోవడం పెద్ద నేరం అంటూ తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా(Media) వార్తలు రాశాయి. రెండు పత్రికలు ఆ వార్తను ఒకే రకంగా రాయడం చూస్తుంటే బహుశా టీడీపీనే ఈ టాస్క్‌ అప్పజెప్పిందేమోననిపిస్తోంది. వార్తలు రాయడంలో తప్పేమీ లేదు. ఏపీ ముఖ్యమంత్రి దావోస్‌కు ఎందుకు వెళ్లలేదని నిలదీయడంలో తప్పు లేదు. కానీ ఆ తప్పుపట్టే క్రమంలో తప్పులనేకం చేశారు. జగన్మోహన్‌రెడ్డి గతంలో ఓసారి దావోస్‌కు వెళ్లారు. అప్పుడేమో దావోస్‌లో జగన్‌ విలాసంగా గడిపివచ్చారు. కుటుంబం కోసం వెళ్లారు అని రాశాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు వరుసగా అయిదుసార్లు వెళ్లి వచ్చారని రాశాయి. సరే.. చంద్రబాబు(Chandrababu) అయిదుసార్లు వెళ్లారుగా.. రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనమేమిటి? వచ్చిన పెట్టుబడులెన్ని? వచ్చిన కంపెనీలు ఎన్ని? వచ్చిన నిధులెన్ని? అయిదేళ్లలో వరుసగా వెళ్లి రావడం వల్ల ఇన్ని కంపెనీలు వచ్చాయి. ఇన్ని నిధులు వచ్చాయి. ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి అని గణాంకాలతో సహా వార్త ఇచ్చి ఉంటే బాగుండేది. జగన్‌ వెళ్లివచ్చినా ఒక్క కంపెనీ రాలేదు. ఒక్కరు కూడా కంపెనీలు పెట్టడానికి ముందుకు రాలేదు అని స్టాటిస్టిక్స్‌ ఇస్తే బాగుండేది. అలా చంద్రబాబు దావోస్‌ పర్యటనకు, జగన్‌ దావోస్‌ పర్యటనకు ఉన్న తేడా గురించి రాస్తే మరింత బాగుండేది. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసివచ్చేవి. అది రాయకుండా అదేదో దావోస్‌కు ప్రపంచమంతా వెళుతుంటే ఒక్క జగన్మోహన్‌రెడ్డినే డుమ్మా కొట్టారని రాయడమే నీచంగా ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్‌ను విమర్శించడానికే రాసినట్టుగా ఉంది. దేశంలో 28 రాష్టాలు ఉంటే దావోస్‌కు వెళ్లింది కేవలం మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే. ఈ విషయం ఆ మీడియాకు తెలియంది కాదు. కానీ జగన్‌ మీద ద్వేషంతో అడ్డదిడ్డంగా కథనాలు రాస్తున్నాయి. వీరి రాతలు రాష్ట్రానికి నష్టం తెస్తున్నాయని గ్రహించడంలేదు.

Updated On 17 Jan 2024 6:29 AM GMT
Ehatv

Ehatv

Next Story