YCP Reaction : వైసీపీ అతి శ్రుతి మించుతోందా?
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్(chandrababu Arrest) తర్వాత ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చింది. అయితే బంద్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉండింది. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు కూడా ఒప్పుకుంటున్నాయి. టీడీపీ మీడియా అయిష్టంగానే దీన్ని అంగీకరిస్తోంది. వైసీపీ క్యాడర్(YCP Cader) మాత్రం ఓ అడుగు ముందుకేసి బంద్‌కు పిలుపునిచ్చారు కానీ హెరిటేజ్ కూడా మూసేయలేదు అని కామెంట్ చేశారు.
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్(chandrababu Arrest) తర్వాత ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చింది. అయితే బంద్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉండింది. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు కూడా ఒప్పుకుంటున్నాయి. టీడీపీ మీడియా అయిష్టంగానే దీన్ని అంగీకరిస్తోంది. వైసీపీ క్యాడర్(YCP Cader) మాత్రం ఓ అడుగు ముందుకేసి బంద్‌కు పిలుపునిచ్చారు కానీ హెరిటేజ్ కూడా మూసేయలేదు అని కామెంట్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటికీ రావాల్సినంత సానుభూతి రాలేదని సాధారణ జనం కూడా అనుకుంటున్నారు. ఈ సందర్భంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతున్న మాటలు, వాడుతున్న భాష టీడీపీ అధినేతకు సానుభూతి తీసుకువస్తున్నదన్న భావన కలుగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రులు వరుసగా మాటల దాడులు చేస్తున్నారు. కేసు గురించి, కేసు వెనుక ఉన్న అవినీతి గురించి మంత్రులు మాట్లాడవచ్చు. తప్పేమీ లేదు. కానీ మరో రెండు కేసులు పెడతాం, చంద్రబాబును జైలు నుంచి బయటకు రానివ్వం, జీవితమంతా జైల్లోనే, చిప్పకూడు తినాల్సిందే అంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి భాషను ఉపయోగించడం ద్వారా తాత్కాలికంగా వారి ఆవేశం చల్లారుతుందేమో కానీ తెలియకుండానే చంద్రబాబుకు సానుభూతిని పెంచుతున్నారు.