ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh) గడచిన నాలుగు రోజులుగా జరుగుతున్న చర్చ 118పైనే! ఇంతకీ ఏమిటా 118 అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(Chandrababu) అక్రమంగా చేరిన 118 కోట్ల రూపాయలు. అమరావతి(amaravati) నిర్మాణానికి సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లు చంద్రబాబుకు ముడుపులు ఇచ్చారని ఐటీ శాఖ(IT Department) అంటోంది. దీనికి
ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh) గడచిన నాలుగు రోజులుగా జరుగుతున్న చర్చ 118పైనే! ఇంతకీ ఏమిటా 118 అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(Chandrababu) అక్రమంగా చేరిన 118 కోట్ల రూపాయలు. అమరావతి(amaravati) నిర్మాణానికి సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లు చంద్రబాబుకు ముడుపులు ఇచ్చారని ఐటీ శాఖ(IT Department) అంటోంది. దీనికి సబంధించిన స్పష్టమైన ఆధారాలను కూడా ఐటీ శాఖ సంపాదించింది. ఈ మేరకు చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు దీనిపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు రియాక్టవ్వలేదు. పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీనిపై మాట్లాడలేదు. అధికారపార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. ప్రతీ చిన్న విషయానికి పెద్దగా రియాక్టయ్యే జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇంత పెద్ద విషయంపై పెదవి విప్పడం లేదు.