Balakrishna And ABN RK : బాలకృష్ణతో ఆర్కేకు గొడవేంటి...?
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్(Chandrababu Arrest) తర్వాత ఆ పార్టీలో మరో సీనియర్ నేత నందమూరి బాలకృష్ణ(Balakrishna) యాక్టీవ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీకి సంబంధించిన నాయకులందరినీ పిలిచి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాన్ని(Party Office)నిర్వహించారు. మీడియాతో ముచ్చటించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు.
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్(Chandrababu Arrest) తర్వాత ఆ పార్టీలో మరో సీనియర్ నేత నందమూరి బాలకృష్ణ(Balakrishna) యాక్టీవ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీకి సంబంధించిన నాయకులందరినీ పిలిచి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాన్ని(Party Office)నిర్వహించారు. మీడియాతో ముచ్చటించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. ధైర్యం కోల్పోవద్దని సూచించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. రాజమండ్రి వెళ్లి టీడీపీ అధినేతను కూడా కలిశారు. ఈ మొత్తం వ్యవహారం టీడీపీ అనుకూల మీడియాలో ప్రముఖంగా రావాలి. కొన్నింటిలో వచ్చింది కూడా! కానీ ఆశ్చర్యమేమిటంటే ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) రిపోర్ట్ చేయడం లేదు. బాలకృష్ణ బొమ్మ పేపర్లో వేసుకోవడానికి రాధాకృష్ణ ఎందుకో నామోషీగా ఫీలవుతున్నారు. బాలకృష్ణ వార్త రాయడానికి ఇబ్బంది పడుతున్నారు. కారణమేమిటో ఈ వీడియోలో చూద్దాం..