Vijayashanthi : : రెండు కళ్ల సిద్ధాంతం కాంగ్రెస్ కు ప్రమాదం!
తెలుగుదేశంపార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) తెలంగాణలో పర్యటించి వెళ్లారు.
తెలుగుదేశంపార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) తెలంగాణలో పర్యటించి వెళ్లారు. ఇక్కడ పార్టీ అభివృద్ధిపై కార్యకర్తలతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపారు. తెలంగాణలో పర్యటన ముగించుకుని ఏపీకి చంద్రబాబు వెళ్లిన తర్వాత ఇక్కడి కాంగ్రెస్ నాయకులు స్పందించడం మొదలు పెట్టారు. చంద్రబాబు తెలంగాణ పర్యటన వెనుక రహస్య ఎజెండా ఉందని అంటున్నారు. విభజనానంతరం రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడం ఆలస్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(revanth reddy) స్పందించారు. తాము మీకు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. రండి, కలిసి మాట్లాడుకుందామన్నారు. రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చారు. ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అప్పుడు మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు తన పర్యటన ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు తెలంగాణ పర్యటన వెనుక రహస్య ఎజెండా ఉందని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను(TS congress) లేకుండా చేయాలన్నది చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఈ విషయంలో భారతీయ జనతాపార్టీ అండదండలు చంద్రబాబుకు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబును అడ్డంపెట్టుకుని ఇక్కడ బీజేపీ బలపడాలని చూస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతికి(Vijayashanthi) వచ్చిన అనుమానాలే ఇప్పుడు అందరికీ కలుగుతున్నాయి. తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాలన బాగుందని అంటూనే తెలంగాణలో బలపడతామని చంద్రబాబు ఎలా అనగలుగుతున్నారని విజయశాంతి ప్రశ్నించారు. చంద్రబాబుపై అనేక సెటైర్లు వేశారు. ఘాటుగా విమర్శించారు కూడా! విజయశాంతికి వచ్చిన సందేహాలే జగ్గారెడ్డికి కూడా వచ్చాయి. ఆయన కూడా విజయశాంతి చేసిన వ్యాఖ్యలనే చేశారు.