Undavali Arun Kumar : ఉండవల్లి మౌనమెందుకు..?
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu) స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో(Central Jail) ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ప్రజా ధనాన్ని కాజేశారన్నది వైసీసీ అంటోంది.

Undavali Arun Kumar
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu) స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో(Central Jail) ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ప్రజా ధనాన్ని కాజేశారన్నది వైసీసీ అంటోంది. ఈ డబ్బులన్నీ ఎటు వెళ్లాయన్నది సీఐడీ విచారణలో తెలుస్తుంది. చంద్రబాబే ప్రధాన లబ్ధిదారు అన్నది ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తున్నది. ఇదే సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ(CBI), ఈడీలు(ED) విచారించాలన్నది ఉండవల్లి వేసిన పిటిషన్ సారాంశం. ఉండవల్లి(Indavali Arun Kumar) గతంలో కూడా అనేక అంశాలపై కోర్టులలో కేసులు వేశారు. తాను ఆ కేసును ఎందుకు వేయాల్సి వచ్చిందో కూడా చెప్పేవారు. అలాగే కేసుకు సబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాతో చెప్పేవారు. కానీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్‌పై మాత్రం ఉండవల్లి మాట్లాడటం లేదు. ఎందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ స్కిల్ డెవలప్‌మెంట్‌పై మౌనంగా ఉంటున్నారు. కేసు వేసి చేతులు దులుపుకున్నారా? అసలు ఉండవల్లి ఆలోచన ఏమిటి?
