మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌(Undavali Arun Kumar) స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు(Skill Development Scam) సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపించండి అంటూ ఏపీ హైకోర్టులో(AP High Court) ఓ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ(CID), ఈడీ(ED) వంటి దర్యాప్తు సంస్థలు మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలనేది ఉండవల్లి భావన. ఈ పిటిషన్‌పైన తెలుగుదేశంపార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. టీడీపీ అభ్యంతరాలేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌(Undavali Arun Kumar) స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు(Skill Development Scam) సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపించండి అంటూ ఏపీ హైకోర్టులో(AP High Court) ఓ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ(CID), ఈడీ(ED) వంటి దర్యాప్తు సంస్థలు మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలనేది ఉండవల్లి భావన. ఈ పిటిషన్‌పైన తెలుగుదేశంపార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. టీడీపీ అభ్యంతరాలేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఉండవల్లిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) మనిషిగా టీడీపీ చూస్తున్నదా? ఉండవల్లితో టీడీపీకి ఏమైనా విభేదాలు ఉన్నాయా? గత కొంతకాలంలో ఉండవల్లికి సంబంధించిన వార్తలను టీడీపీ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జగన్‌ పాలనపై చాలా సందర్భాలలో విమర్శలు గుప్పించారు ఉండవల్లి. అప్పుడేమో ఉండవల్లి వారికి కావాల్సినవారయ్యారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్‌ వేయగానే ఉండవల్లి శత్రువయ్యారు. తనమీద వచ్చిన ఆరోపణలలో నిజముందా? లేదా? అన్న విషయాన్ని చంద్రబాబు రుజువు చేసుకుంటే మంచిదే కదా! చంద్రబాబు ఏ తప్పు చేయనప్పుడు బయటకు వస్తాడుగా? చంద్రబాబును ఉద్దేశపూర్వంగానే జగన్‌ అరెస్ట్‌ చేయించాడని పదే పదే అంటున్న టీడీపీ నేతలకు ఉండవల్లి హైకోర్టులో వేసిన పిటిషన్‌ నిజానికి ఆనందాన్ని కలిగించాలి. ఎందుకంటే సీబీఐ, ఈడీలు కేంద్ర దర్యాప్తు సంస్థలు కాబట్టి. జగన్‌ ప్రమేయం పోతుంది కాబట్టి. అయినప్పటికీ టీడీపీ వాళ్లు ఎందుకో భయపడుతున్నారు? ఉండవల్లి హైకోర్టు పిటిషన్‌తో ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఈ వీడియోలో చూద్దాం.

Updated On 23 Sep 2023 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story