ఎన్నికల(Elections) సమయంలో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు కీలకంగా మారారు. వ్యూహకర్తలు చెప్పినదాని ప్రకారం పార్టీలు నడుచుకుంటున్నాయి. వ్యూహకర్తలను గతంలో కేవలం ఎన్నికలప్పుడే ఉపయోగించుకునేవారు. ఇంతకు ముందు వ్యూహకర్తలు ఉండేవారు కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా వ్యూహాలు రచించుకునేది. ప్రణాళికలు వేసుకునేది. దశాబ్దకాలం నుంచి పార్టీలకు వ్యూహకర్తలు అవసరం పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా వ్యూహకర్తలను భాగం చేస్తున్నారు. బీహార్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో మనం చూశాం! ప్రభుత్వ నిర్ణయాలను కూడా వ్యూహకర్తలు ప్రభావితం చేస్తున్నారు.

ఎన్నికల(Elections) సమయంలో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు కీలకంగా మారారు. వ్యూహకర్తలు చెప్పినదాని ప్రకారం పార్టీలు నడుచుకుంటున్నాయి. వ్యూహకర్తలను గతంలో కేవలం ఎన్నికలప్పుడే ఉపయోగించుకునేవారు. ఇంతకు ముందు వ్యూహకర్తలు ఉండేవారు కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా వ్యూహాలు రచించుకునేది. ప్రణాళికలు వేసుకునేది. దశాబ్దకాలం నుంచి పార్టీలకు వ్యూహకర్తలు అవసరం పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా వ్యూహకర్తలను భాగం చేస్తున్నారు. బీహార్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో మనం చూశాం! ప్రభుత్వ నిర్ణయాలను కూడా వ్యూహకర్తలు ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన సునీల్‌ కనుగోలు(Suil Kanugolu) తెలంగాణలో(telangana) కూడా కాంగ్రెస్‌ విజయంలో ప్రధానభూమికను పోషించారు. ప్రస్తుతం సునీల్‌ కనుగోలు కార్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా ఉన్నారు. క్యాబినెట్‌ హోదాను అనుభవిస్తున్నారు. ఆయన అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలు, వ్యూహాలు రూపొందించారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాబోతున్నదన్న ఓ ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో, కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందంటూ ప్రచారం చేయడంలో సునీల్ కనుగోలు వ్యూహాలు బాగా పనిచేశాయంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు చెబుతూ వస్తున్నారు. సునీల్‌ కనుగోలు తీసుకొచ్చిన నినాదాలు మార్పు కోసం, మార్పు కావాలి, కాంగ్రెస్‌ రావాలి ప్రజలను బాగా కదిలించాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి సునీల్‌ కనుగోలు మేథస్సు బాగా ఉపయోగపడిందని ఆ పార్టీ వారు చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి ఎన్నికలకు వెళదామనుకున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ సలహాలు సూచనలు తీసుకోవాలని అనుకున్నారు. ఇద్దరి మధ్య కొన్ని భేటీలు కూడా జరిగాయి. ప్రశాంత్‌ కిశోర్‌ మా కోసం పని చేస్తున్న మాట నిజమేనని కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా చెప్పారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ప్రశాంత్‌ కిశోర్‌ లేకుండానే బీఆర్‌ఎస్‌ ఎన్నికలకు వెళ్లింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. మాకు ఎన్నికల వ్యూహకర్తలు అవసరం లేదు, మా పార్టీ అధినేత చంద్రబాబే(Chandrababu) అతి పెద్ద వ్యూహకర్త అని చెప్పుకుంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ(TDP) ప్రశాంత్‌ కిశోర్‌(Prashanth Kishore) వల్లే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని నమ్మింది. ఎన్నికల్లో పరాజయంపాలైన తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ బృందంలో చాలా యాక్టివ్‌గా పని చేసిన రాబిన్‌ శర్మ అనే వ్యక్తిని తీసుకొచ్చి తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకుంది. ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌లో సునీల్‌ కనుగోలు, రాబిన్‌ శర్మ కీలకంగా పని చేసిన వ్యక్తులు. తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ నుంచి విడిపోయి ఎవరికి వారుగా వ్యూహకర్తలయ్యారు. తమ సొంత టీమ్‌ను రన్‌ చేసుకుంటున్నారు. చాలా మంది టీడీపీ నేతలకు రాబిన్‌శర్మ పనితీరుపై అసంతృప్తి ఉంది. రాబిన్‌ శర్మ బృందం ఇచ్చే సలహాలు పార్టీకి ఏమాత్రం ఉపకరించడం లేదన్నది మెజారిటీ నేతల భావన. టీడీపీ ఆశించిన స్థాయిలో రాబిన్‌శ‌ర్మ నుంచి ఔట్‌పుట్ రాలేద‌ని అభిప్రాయం కూడా ఉంది. దీంతో రాబిన్‌శ‌ర్మ‌ను కేవ‌లం లోకేశ్ ప్ర‌చారం, అలాగే చంద్ర‌బాబు స‌భల నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల వ‌ర‌కే ప‌రిమితం చేసింది.ఆయన డిజైన్‌ చేసిన కార్యక్రమాలు కూడా జనంలోకి వెళ్లలేదు. పైపెచ్చు బూమరాంగ్‌ అయ్యాయి. ఇందుకు పెద్ద ఉదాహరణ ఇదేంఖర్మ కాంపెయిన్‌! అందుకే తెలుగుదేశంపార్టీ వ్యూహకర్తను మార్చాలనుకుంటోంది. త్వరలో కొత్త వ్యూహకర్త రాబోతున్నాడు. జ‌గ‌న్‌ను ఎదుర్కోడానికి మంచి వ్యూహ‌క‌ర్త అవ‌స‌ర‌ం ఎంతో ఉందని చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో సునీల్‌ కనుగోలుతో చ‌ర్చ‌లు కూడా జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలును తీసుకునేందుకు ఆరంభంలో చంద్ర‌బాబు, లోకేశ్ ఆస‌క్తిగా లేకపోయినా ఇప్పుడు అనివార్యమయ్యిందని అంటున్నారు. సునీల్‌ కనుగోలుతో ఒప్పందం కుదిరితే మాత్రం అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే సునీల్‌ కనుగోలు గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా వ్యవహరించారు. రాబిన్‌ శర్మను అలాగే ఉంచి, సునీల్‌ కనుగోలును తీసుకోవడమా? లేక రాబిన్‌ శర్మను పూర్తిగా తప్పించేయడమా అన్నది టీడీపీ ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారికంగా ఒప్పందం కుదిరితే మాత్రం మరుక్షణంనుంచే ఆయన పనిలో పడాల్సి వుంటుంది.

Updated On 12 Dec 2023 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story