Chandrababu : జైలులో ఏసీ లేదని గగ్గోలు, మండుటెండలో బాబు అని గొప్పలు!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అధికారపక్షంపై అటాక్ చేసే బరువు బాధ్యతలను తెలుగుదేశంపార్టీ(TDP) కంటే దాన్ని మోస్తున్న పత్రికలే(Media) ఎక్కువగా మోస్తుంటాయి. నారా చంద్రబాబునాయుడిపై(Nara Chandrababu) ఈగ కూడా వాలనివ్వకుండా రక్షిస్తుంటాయి. చంద్రబాబునాయుడను జాకీలేసి మరీ లేపుతుంటాయి. చాణక్యుడి కంటే చంద్రబాబునాయుడే గొప్పోరని, ఆయనకు తెలియని విద్య అంటూ ఏదీ లేదని భుజకీర్తులు తగిలిస్తూ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అధికారపక్షంపై అటాక్ చేసే బరువు బాధ్యతలను తెలుగుదేశంపార్టీ(TDP) కంటే దాన్ని మోస్తున్న పత్రికలే(Media) ఎక్కువగా మోస్తుంటాయి. నారా చంద్రబాబునాయుడిపై(Nara Chandrababu) ఈగ కూడా వాలనివ్వకుండా రక్షిస్తుంటాయి. చంద్రబాబునాయుడను జాకీలేసి మరీ లేపుతుంటాయి. చాణక్యుడి కంటే చంద్రబాబునాయుడే గొప్పోరని, ఆయనకు తెలియని విద్య అంటూ ఏదీ లేదని భుజకీర్తులు తగిలిస్తూ ఉంటాయి. అమరావతిలో ఒలింపిక్స్‌ను నిర్వహిస్తానని, గెలిచిన వారికి నోబెల్ ప్రైజ్ ఇస్తానని చంద్రబాబు చెబితే ఆ వ్యాఖ్యలు తమ పత్రికల్లో రాకుండా జాగ్రత్త తీసుకుంటాయి. చంద్రబాబు కారణంగా పుష్కరాలలో అంత మంది చనిపోతే, మొదటి రోజు పుష్కరాలకు ఎవరు వెళ్లమన్నారంటూ ప్రజలదే తప్పుగా చిత్రీకరిస్తాయి. జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Mohan reddy) కంటే చంద్రబాబు చాలా చాలా గొప్పవారిని అభివర్ణిస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్త స్లోగన్‌ను అందిపుచ్చుకున్నది టీడీపీ అనుకూల మీడియా. 70 ఏళ్ల వయసులో మండుటెండల్లో తిరుగుతున్నారని, అదే జగన్మోహన్‌రెడ్డి ఏసీ బస్సులలో పర్యటిస్తున్నారని రోత రాతలు రాసుకొచ్చాయి. ఇలా రాస్తున్న పత్రికలకు నాలుగు నెలల కిందట జరిగిన సంఘటనలు గుర్తుకురాకపోడం విడ్డూరం. నిరుడు సెప్టెంబర్, అక్టోబరు మాసాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గమనించదగ్గ విషయమేమిటంటే అది చలికాలం.. ఎండకాలం కూడా కాదు. ఆ సయమంలో చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా నానా గగ్గోలు పెట్టింది. బహుశా చంద్రబాబు ఫ్యామిలీ కూడా ఇంతగా బాధపడలేదేమో! ఆయనకు రాజమండ్రి జైలులో ఏసీ లేకపోతే ఎలా? ఏసీ లేకుండా ఆయన ఎలా ఉండగలరు? ఏడు పదుల వయసులో జైలు జీవితం భరించడం కష్టం. ఆయనకు రకరకాల వ్యాధులు ఉన్నాయి. స్కిన్ ఎలెర్జీ కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఏసీ లేకుండా ఎలా ఉండగలరుగుతారు? ప్రభుత్వం ఏసీ గదిని ఎందుకు కేటాయించలేదు? జైలులో ఏసీ లేదని గగ్గోలు పెట్టిన టీడీపీ మీడియా ఇప్పుడేమో మండుటెండలలో తిరుగుతున్నారటూ గొప్పలు చెబుతున్నది.