చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar).. తెలుగుదేశంపార్టీకి(TDP) ఈయన ఫైర్‌బ్రాండ్. దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విప్‌గా(VIP) పనిచేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు తెలుగుదేశంపార్టీని టార్గెట్ చేయడానికి చింతమనేని బాగా పనికి వచ్చేవారు. గతంలో ఒక ఎమ్‌ఆర్‌వో పైన చింతమనేని ప్రభాకర్ దాడి చేయడమనేది తెలుగుదేశంపార్టీకి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది.
చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar).. తెలుగుదేశంపార్టీకి(TDP) ఈయన ఫైర్‌బ్రాండ్. దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విప్‌గా(VIP) పనిచేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు తెలుగుదేశంపార్టీని టార్గెట్ చేయడానికి చింతమనేని బాగా పనికి వచ్చేవారు. గతంలో ఒక ఎమ్‌ఆర్‌వో పైన చింతమనేని ప్రభాకర్ దాడి చేయడమనేది తెలుగుదేశంపార్టీకి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది. ఇప్పటికీ మహిళలపైన దాడులకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడానికి వనజాక్షి పేరును ఉపయోగించుకుంటుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారనే కారణంతో వనజాక్షిపై దాడి చేశారు చింతమనేని. ఆమెపై చేయి కూడా చేసుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో(Social media) వైరల్ కావడంతో (టీడీపీ అనుకూల మీడియా ఎలాగూ వీటిని ప్రసారం చేయదు) చంద్రబాబు(Chandrababu) సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు చింతమనేనిపై చర్య తీసుకోకపోగా, కాంప్రమైజ్‌కు ప్రయత్నించారనే విమర్శలు కూడా చంద్రబాబుపై వచ్చాయి. అలాంటి చింతమనేని ప్రభాకర్ మీద ఈ ప్రభుత్వ హయాంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం చింతమనేని కొంతకాలం అజ్ఞాతంలోకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత జైలు జీవితం గడిపారు. ఇప్పుడు దెందులూరులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో చింతమనేని ఉన్నారు. జనసేనతో (Janasena)టీడీపీ పొత్తుపెట్టుకోవాలని మొదట ఆకాంక్షించిన వ్యక్తి చింతమనేనినే! అలాంటి చింతమనేని ఇప్పుడు సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆ వ్యతిరేకత ఎందుకొచ్చిందో, దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం.