తెలుగుదేశం పార్టీతో(TDP) కలిసి వెళతామని జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. అంతే కాదు భారతీయ జనతా పార్టీ(BJP) కూడా తమతో కలిస్తే బాగుంటుందని పవన్‌ ఆకాంక్షించారు. గతంలో ఎన్డీయే(NDA) సమావేశానికి వెళ్లినప్పుడు టీడీపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందని మాట్లాడిన పవన్‌ ఇప్పుడేమో టీడీపీతో మనం కలిసి వెళతామని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీతో(TDP) కలిసి వెళతామని జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. అంతే కాదు భారతీయ జనతా పార్టీ(BJP) కూడా తమతో కలిస్తే బాగుంటుందని పవన్‌ ఆకాంక్షించారు. గతంలో ఎన్డీయే(NDA) సమావేశానికి వెళ్లినప్పుడు టీడీపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందని మాట్లాడిన పవన్‌ ఇప్పుడేమో టీడీపీతో మనం కలిసి వెళతామని అంటున్నారు. టీడీపీతో కలవడంపై పవన్‌ ఓ క్లారిటీ ఇచ్చేశారు పవన్‌. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ కూటమివైపుకు రావాలంటే ఏం చేయాలి? అయితే టీడీపీ-జనసేనతో కలవడానికి బీజేపీ కొన్ని షరతులు పెడుతున్నదని సమాచారం. 2014లో వైసీపీతో(YCP) ఏ కాంబినేషన్‌ అయితే పోరు సల్పిందో అదే కాంబో ఇప్పుడు రిపీట్ అవుతున్నా.. ఈసారి మాత్రం ఈ కూటమికి లీడ్‌ చేసే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ కావాలన్నది బీజేపీ డిమాండ్‌. చంద్రబాబు(Chandrababu) ఏమో జైలులో ఉన్నారు. అంచేత కూటమికి పవన్‌ సారథ్యం వహిస్తేనే బాగుంటుందన్నది బీజేపీ భానవ. అంతే కాదు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి. అసలు బీజేపీ కేంద్ర నాయకత్వం పెడుతున్న డిమాండ్లేమిటో, అవి ఎంత వరకు నేరవేరతాయో ఇప్పుడు చూద్దాం.

Updated On 16 Sep 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story