Chandrababu Security : జైలులో చంద్రబాబు భద్రతపై ఎందుకీ అనుమానాలు?
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడుకు జైలులో భద్రత(Security) లేని పరిస్థితులు ఉన్నాయా? టీడీపీ క్యాడర్ కంటే ఎక్కువగా టీడీపీ మీడియా ఎందుకింత ఆందోళన చెందుతున్నది? దక్షిణభారత దేశంలోనే ఎన్‌ఎస్‌జి సెక్యూరిటీ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు. జైలులోపల ఉన్నా భద్రత కట్టుదిట్టంగానే ఉంటుంది. ప్రతీ అంశాన్ని ఎన్‌ఎస్‌జి చూసుకుంటుది.
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడుకు జైలులో భద్రత(Security) లేని పరిస్థితులు ఉన్నాయా? టీడీపీ క్యాడర్ కంటే ఎక్కువగా టీడీపీ మీడియా ఎందుకింత ఆందోళన చెందుతున్నది? దక్షిణభారత దేశంలోనే ఎన్‌ఎస్‌జి సెక్యూరిటీ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు. జైలులోపల ఉన్నా భద్రత కట్టుదిట్టంగానే ఉంటుంది. ప్రతీ అంశాన్ని ఎన్‌ఎస్‌జి చూసుకుంటుది. జైలులోపల మొత్తం బ్యారక్‌ను ఖాళీ చేయించి కేవలం చంద్రబాబు కోసం కేటాయించామని, మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని , ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి వైద్య బృందాన్ని పెట్టామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ టీడీపీ మీడియా చంద్రబాబు భద్రతపై సందేహం వ్యక్తం చేస్తోంది. పార్టీ కార్యకర్తలలో ఓ రకమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడానికా? వారిని ఆందోళనకు గురి చేయడానికా? గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ నాయకులు జైలులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఎప్పుడూ ఎవరికీ లేని ఆందోళన చంద్రబాబు విషయంలోనే ఎందుకు జరుగుతోంది? దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు? వెనుక ఉన్న కారణాలేమిటి?