స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో(Skill Development Case) తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబు(chandrababu) జైలుకు వెళ్లాడు. ఇప్పుడు తీగ లాగామని, త్వరలోనే డొంక కదులుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) నాయకులు అంటున్నారు. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, వాస్తవ రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయ. కోర్టులో సీఐడీ(CID) పిటి వారెంట్‌ను దాఖలు చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో(Skill Development Case) తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబు(chandrababu) జైలుకు వెళ్లాడు. ఇప్పుడు తీగ లాగామని, త్వరలోనే డొంక కదులుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) నాయకులు అంటున్నారు. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, వాస్తవ రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయ. కోర్టులో సీఐడీ(CID) పిటి వారెంట్‌ను దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగురోడ్డు అంశంలో చంద్రబాబునాయుడును విచారించాల్సి అవసరం ఉందని , ఆయనను కస్టడికి ఇవ్వండి అని పిటిషన్‌ వేశారు. అమరావతి ఇన్నింగ్‌ రింగ్ రోడ్డు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు ఉంది. మాజీ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) పేరు కూడా ఉంది. ఆ అంశంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ అంటోంది. వరుసగా ఈ కేసులన్నింటినీ విచారించాలనే ఆలోచనను సీఐడీ చేస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు, ఫైబర్‌ కేసు ..ఇలా కేసులన్నింటినీ విచారించాలని అనుకుంటోంది.

Updated On 11 Sep 2023 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story